
వైద్యం వికటించి వ్యక్తి మృతి
పీలేరురూరల్ : వైద్యం వికటించి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శశి ఆర్థో హాస్పిటల్‌లో జరిగింది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కేవీపల్లె మండలం కేవీపల్లెకు చెందిన పి. ఖాదర్ ఖాన్ (47) పీలేరు ట్రాన్స్‌కో కార్యాలయంలో కాంట్రాక్టు ప్రాతిపదికన డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ పీలేరు పట్టణంలోని శ్రీ లక్ష్మీ హాస్పిటల్‌లో చేరాడు. పరిశీలించిన వైద్యులు కిడ్నీలో రాళ్లు ఉన్నాయని శశి ఆర్థో హాస్పిటల్‌కు రెఫర్ చేశారు. సోమవారం శశి హాస్పిటల్‌లో చేరాడు. సోమవారం సాయంత్రం 4 గంటలకు తిరుపతి నుంచి కిడ్నీ శస్త్రచికిత్స వైద్య నిపుణులు వచ్చి ఆపరేషన్ చేశారు. అయితే మంగళవారం సాయంత్రం ఖాదర్‌ఖాన్ మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతోనే నిండుప్రాణం పోయిందని కుటుంబ సభ్యులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆస్పత్రి యాజమాన్యం డాక్టర్ శశిభూషణ్‌రెడ్డిని వివరణ కోరగా ఆపరేషన్ చేసి 24 గంటలైందని, ఇక డిశ్ఛార్జి చేయాలనుకున్న సమయంలో మృతి చెందాడని తెలిపారు. ఈ విషయంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతునికి భార్య తోపాటు, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
రైల్వేస్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతి
కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫారం–1పై మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని కడప రైల్వే పోలీసులు తెలిపారు. రైల్వేస్టేషన్ తూర్పు వైపున ప్రయాణికులు కూర్చొ,నే స్టాండ్‌పై మృతదేహాన్ని గుర్తించామన్నారు. మృతుడు యాచకునిగా భావిస్తున్నామన్నారు. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీలో భద్రపరిచామని, గుర్తించిన వారు కడప రైల్వే పోలీసులను సంప్రదించాలన్నారు.
ఉప్పరపల్లె రైల్వే ట్రాక్ వద్ద..
సిద్దవటం: ఉప్పరపల్లె గ్రామ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద గురు తెలియని వ్యక్తి మృతదేహం(55) లభ్యమైంది. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఇతను రెండు రోజుల కింద మృతి చెందినట్లు భావిస్తున్నారు. ఇతను ప్రమాద వశాత్తు రైలులోనుంచి కింద పడ్డాడా, లేదా ఎవరైనా చంపి పడేశారా అనే కోణంలో విచారిస్తున్నట్లు కడప రైల్వే ఎస్‌ఐ సుదర్శన్ రెడ్డి తెలిపారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించామన్నారు.
ఎర్రచందనం కేసులో నిందితుడి అరెస్టు
నందలూరు : ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో వాయిదాలకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న రాజంపేట మండలం రేణింతల అరుంధతివాడకు చెందిన పాటూరు సుబ్రమణ్యం అలియాస్ మణిని అరెస్టు చేసి తిరుపతి ఆర్‌ఎస్‌ఎస్ కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఎర్రచందనం కేసులో నిందితుడిగా ఉండి కోర్టు వాయిదాలకు హాజరు కానందున కోర్టు అతనిపై నాన్ బెయిలబుల్ వారంట్ ఇచ్చిందన్నారు. అతన్ని తమ సిబ్బంది పట్టుకొని తిరుపతి స్పెషల్ ఆర్‌ఎస్‌ఎస్ కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ నిమిత్తం రాజంపేట సబ్ జైలుకు తరలించిందన్నారు.

వైద్యం వికటించి వ్యక్తి మృతి

వైద్యం వికటించి వ్యక్తి మృతి

వైద్యం వికటించి వ్యక్తి మృతి

వైద్యం వికటించి వ్యక్తి మృతి