యూరియా కొరత.. రైతులకు వెత | - | Sakshi
Sakshi News home page

యూరియా కొరత.. రైతులకు వెత

Jul 23 2025 7:05 AM | Updated on Jul 23 2025 7:05 AM

యూరియ

యూరియా కొరత.. రైతులకు వెత

సిద్దవటం : మండలంలోని రైతులకు యూరియా తగినంత ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దవటం మండలంలోని వంతాటిపల్లె రైతు సేవా కేంద్రానికి 10 టన్నుల యూరియా మంజూరు కావడంతో మంగళవారం వంతాటిపల్లె రైతు భరోసా కేంద్రం పరిధిలోని సంటిగారిపల్లె, వంతాటిపల్లె, ఎస్‌.రాజంపేట గ్రామాల రైతులు పెద్ద ఎతున యూరియా కోసం ఎగబడ్డారు. బస్తా యూరియా రూ. 270 తీసుకుంటున్నారు. ఒక ఎకరా పొలం ఉన్న రైతులకు ఒక బస్తా ఇస్తున్నారు. 2 ఎకరాలు అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు కూడా రెండు బస్తాలు యూరియా ఇస్తామంటున్నారు. అలా ఇస్తే పంటలకు ఎలా సరిపోతుందని అధికారులను నిలదీశారు. అయితే జ్యోతి రైతుసేవా కేంద్రం పరిధిలోని ఖాదర్‌బంగ్లా, జ్యోతి, గొల్లపల్లి, జ్యోతి గ్రామాలకు చెందిన రైతులు కూడా వంతాటిపల్లెకు వచ్చి యూరియా కావాలని అధికారులను కోరారు. దీంతో యూరియా పంపిణీని అధికారులు ఆపేసి జ్యోతి రైతు సేవా కేంద్రానికి కూడా 10 టన్నులు యూరియా రావాల్సి ఉందని అది వచ్చిన తరువాత రెండు రైతు సేవా కేంద్రాల్లో ఒకేసారి పంపిణీ చేస్తామని అధికారులు చెప్పి రైతుసేవా కేంద్రానికి తాళాలు వేసి వెళ్లారు.

మున్మిపల్‌ కార్మికుల వినూత్న నిరసన

రాజంపేట : రాజంపేట మున్సిపల్‌ కార్మికుల సమ్మెలో భాగంగా మంగళవారం కార్మికులు పొర్లు దండాలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికులతో చర్చించకుండా సోమవారం సొంతంగా జీతాలు పెంచడం అన్యాయమన్నారు. ప్రభుత్వ పథకాలు కార్మికులకు అందజేయాలని అడిగితే ఆ విషయం గురించి మాట్లాడిన దాఖలాలు లేవన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు చిట్వేల్‌ రవికుమార్‌, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి పి.వి. రమణ, సీహెచ్‌ ఓబయ్య, ప్రసాద్‌, జిల్లా కోశాధికారి లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.

బెల్టు షాపులపై దాడులు

బ్రహ్మంగారిమఠం : మండల కేంద్రమైన బ్రహ్మంగారిమఠంలో మంగళవారం మధ్యాహ్నం ఎస్‌ఐ శివప్రసాద్‌ సిబ్బందితో కలసి బెల్టు షాపులపై దాడులు నిర్వహించారు. బ్రహ్మంసాగర్‌కు వెళ్లేదారిలో ఓ బెల్టు షాపు దుకాణంలోకి వెళ్లగా అక్కడ షాపు నిర్వాహకుడు పరారయ్యాడు. బెల్టుషాపులో 35 క్వార్టర్‌ బాటిళ్లు, వివిధ రకాల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

హత్యాయత్నం కేసులో ఆరుగురి అరెస్టు

– కత్తి, మోటార్‌ సైకిల్‌,

నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం

కడప అర్బన్‌ : కడప నగరం గంజికుంట కాలనీలో గత నెల 25వ తేదిన గొంటుముక్కల వెంకటసుబ్బయ్యపై కత్తితో దాడి చేసిన కేసుకు సంబంధించి ఆరుగురిని అరెస్టు చేసినట్లు చిన్నచౌకు సీఐ ఓబులేసు తెలిపారు. చిన్నచౌక్‌ పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో సీఐతో పాటు ఎస్‌ఐ రాజరాజేశ్వర్‌ రెడ్డి వివరాలు వెల్లడించారు. కడప మాసాపేటకు చెందిన తాటిగిరి అనూష, పాలెం సుబ్బరాయుడు అలియాస్‌ సుబ్బన్న, చింతకొమ్మదిన్నె మండలం నరసరామయ్యగారిపల్లికి చెందిన సోమ ప్రశాంత్‌, సుగమాల నవీన్‌ అలియాస్‌ శిగనమాల నవీన్‌, సిబ్యాల సుబ్బరాయుడు మాసాపేటకు చెందిన తాటిగిరి నిర్మలను అరెస్టు చేసినట్లు తెలిపారు. వెంకటసుబ్బయ్య, తాటిగిరి అనూష మధ్య మనస్పర్థలు ఉన్న నేపథ్యంలో గత నెల 25వ తేదీ వెంకటసుబ్బయ్యపై దాడి జరిగిందన్నారు.

యూరియా కొరత..  రైతులకు వెత   1
1/1

యూరియా కొరత.. రైతులకు వెత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement