
పారిశుధ్యంపై దృష్టి సారించాలి
లక్కిరెడ్డిపల్లి : పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పారిశుధ్యంపై దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి రాధమ్మ పేర్కొన్నారు. లక్కిరెడ్డిపల్లి మండలంలోని మద్దిరేవుల గ్రామ పంచాయతీలో ఆమె మంగళవారం చెత్త సేకరణపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. గ్రామంలోని ఈడిగపల్లి, అప్పలరాజుపల్లి, జిఎంఆర్ కాలనీలలో గ్రీన్ అంబాసిడర్ల ద్వారా చెత్త సేకరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. వర్షాకాలం కావడం వల్ల బ్లీచింగ్ పౌడర్, గుంతలలో, చేతి బావుల వద్ద, బోరింగ్ కుళాయిల వద్ద చల్లాలని సిబ్బందికి సూచించారు. గతంలో పాత మూడు చక్రాల చెత్త సేకరణ ట్రాలీని, టీవీఎస్ ద్విచక్ర వాహనంతో అనుసంధానించి అతి తక్కువ ఖర్చుతో చెత్త సేకరణ వాహనం రూపొందించినట్లు పంచాయతీ కార్యదర్శి రజనీష్ రెడ్డి పంచాయతీ అధికారికి వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు వేణుగోపాల్, గిరిబాబుతోపాటు గ్రీన్ అంబాసిడర్లు నాగేశ్వర, చంద్రయ్య, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పంచాయతీ అధికారి రాధమ్మ