
సోమశిలలోకి కృష్ణమ్మ పరుగులు !
రాజంపేట : సోమశిలలోకి కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. సోమవారం నమోదైన 3, 055 క్యూసెక్కుల ప్రవాహం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. అధికారుల అంచనా కన్నా ముందే జలాలు సోమశిలకు చేరుతున్నాయి. కర్నూలు జిల్లాలో కురుస్తున్న వర్షాలతో కుందూ నది ద్వారాను కలిసొచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఆదినిమ్మాయపల్లె వద్ద..
ఈ ఏడాది జూలై నెలలోనే కృష్ణానదికి వరదలు ఉధృతృంగా వచ్చాయి. దీంతో శ్రీశైలం జలాశయం నిండిన సంగతి విదితమే. సాగర్‌కు నీటిని విడుదల చేశారు. అవి కాస్తా పెన్నా (సిద్ధవటం, ఒంటిమిట్ట) ద్వారా సోమశిలకు చేరుతున్నాయి. శ్రీశైలంలో 203.43 టీఎంసీలు ఉండగా, జలాశయంలోకి 1,75,233 క్యూసెక్కులు వస్తోంది. దాంతో తెలుగుగంగకు విడుదలను మరింత పెంచే అవకాశం ఉంది. అదే స్థాయిలో సోమశిలకు రానున్నాయి. కడప జిల్లా ఆదినిమ్మాయపల్లె వద్ద పెన్నాలో 1800 క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది.
27.616 టీఎంసీల నిల్వ..
సోమశిలలో 27.616 టీఎంసీల నీటి నిల్వ ఉండగా , కృష్ణా జలాలు జత కావడంతో జలాశయంలోకి 3,055 క్యూసెక్కుల ప్రవాహమే ఉంది. జూలైలో వర్షాల కారణంగా ప్రవాహం క్రమంగా పెరిగే పరిస్థితి ఉంది. సోమశిల ఆయకట్టుకు సాగునీరు పుష్కలంగా అందనుంది. ఇన్‌ఫ్లో క్రమంగా పెరిగే అవకాశం ఉందని జలాశయం అధికారులు అంటున్నారు.
వెనుక జలాలు నిలకడగా..
సోమశిల జలాశయం కెపాసిటీ 77.988 టీఎంసీగా ఉంది. జలాశయంలో నీటి మట్టం 90,879 మీటర్ల వ ద్దకు చేరుకుంది. అన్నమయ్య, కడప జిల్లాలో విస్తరించి ఉన్న అట్లూరు, ఒంటిమిట్ట, నందలూరు మండలా ల పరిధిలో వెనుక జలాలు నిలకడగానే ఉన్నాయి.
27.616 టీఎంసీలు నిల్వ
డ్యాంలోకి ఇన్‌ఫ్లో 3,055 క్యూసెక్కులు