
● సీడబ్ల్యూసీ చెంతలో..
ఇప్పటికే సీడబ్ల్యూసీ చెంతకు రెండు డిజైన్లు చేరుకున్నాయి. గతంలో జలవనరుల శాఖ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్‌యాదవ్, కడప ఎస్‌ఈ శ్రీనివాస్, రాజంపేట ఈఈ రవికిరణ్‌లు సీడబ్ల్యూసీ, పూణెలో సెంట్రల్ వాటర్ రిసోర్స్‌స్ పవర్ స్టేషన్‌లకు వెళ్లి పరిశీలించి వచ్చారు. డ్యాం రక్షణ దృష్ట్యా ఏ డిజైన్ అనుకూలంగా ఉంటుందో అనేది త్వరలోనే సీడబ్ల్యూసీ వెల్లడించనున్నది. నదీ గర్భంలో ఇసుక 40 మీటర్ల మేర లోతు వరకు ఉండటంతో.. రెండు డిజైన్‌లలో ఏ డిజైన్‌కు సీడబ్ల్యూసీ మొగ్గుచూపుతుందో వేచి చూడాల్సిందే. కాంక్రీట్ డ్యాం వరకు తీసుకుంటే 21 గేట్లు వస్తాయి, కొత్తగా తెరపైకి వచ్చిన డిజైన్ రాక్‌ఫిల్ డ్యాం అయితే, అదనంగా స్పిల్‌వే నిర్మించి 9 గేట్లను ఏర్పాటు చేసే దిశగా డిజైన్లు రూపొందించారు.