
ఆటోమొబైల్ దుకాణం తనిఖీ
రాయచోటి జగదాంబసెంటర్ : కడప రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు రాయచోటి–చిత్తూరు రోడ్డులోని రాందేవ్ ఆటోమొబైల్స్ షాపును విజిలెన్స్ అధికారులు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణంలో కొనుగోలు చేసే వస్తువులపై ఎంఆర్‌పీ ధరలు లేవని, జీఎస్‌టీ లైసెన్సు లేకుండా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు తనిఖీ అధికారులు గుర్తించారు. రాజధాని ఆటో మొబైల్స్, రాందేవ్ ఆటోమొబైల్స్ పేర్లతో వేర్వేరుగా యజమాని వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు తనిఖీ అధికారులు గుర్తించారు. ఈ షాపులో సేల్ బిల్స్ ఇవ్వడంలేదని గుర్తించి దుకాణాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ తనికీల్లో ఎం.శివన్న, గీతావాణి, బాబుమోజెస్, రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
వేర్వేరు ప్రమాదాల్లో
ఎనిమిది మందికి గాయాలు
మదనపల్లె రూరల్ : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడి మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మదనపల్లె మండలం సీటీఎం పంచాయతీ వంక వడ్డిపల్లెకు చెందిన ఈశ్వరయ్య(65), అతడి భార్య సుందరమ్మ(60) గురువారం రాత్రి ద్విచక్ర వాహనంలో మదనపల్లెకు వచ్చారు. గ్రామంలో గొడవ విషయమై తాలూకా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేసి స్వగ్రామానికి వెళ్తున్నారు. కొత్తవారిపల్లె సమీపంలో ఎదురుగా వచ్చిన మరో ద్విచక్ర వాహనం వీరిని ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. అదే విధంగా పీలేరుకు చెందిన తరుణ్(20), అష్రఫ్(22), నిఖిల్(21), బాలాజీ(23), ప్రేమ్‌కుమార్(22) వ్యక్తిగత పనులపై గురువారం కారులో మదనపల్లెకు వచ్చారు. పనులు ముగించుకుని శుక్రవారం తెల్లవారుజామున తిరిగి పీలేరుకు బయలుదేరారు. బైపాస్ దారిలో వెళుతుండగా కొత్తవారిపల్లె సమీపంలో వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ప్రమాదంలో ఐదుగురు గాయపడగా స్థానికులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అదే విధంగా బి.కొత్తకోటకు చెందిన హేమకుమార్ గురువారం రాత్రి ద్విచక్ర వాహనంలో బెంగళూరుకు వెళ్తున్నారు. గౌనిపల్లె సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108లో బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం బాధితుడిని తిరుపతికి రెఫర్ చేశారు. పోలీసులు కేసులు విచారణ చేస్తున్నారు.

ఆటోమొబైల్ దుకాణం తనిఖీ

ఆటోమొబైల్ దుకాణం తనిఖీ