
11 మంది గంజాయి విక్రేతల అరెస్టు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : కడప నగర శివారులో గంజాయి విక్రయిస్తున్న 11 మందిని అరెస్టు చేసినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఆసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని కడప ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్‌లో విలేకరులతో శుక్రవారం ఆయన మాట్లాడుతూ చింతకొమ్మదిన్నె చెరువు వద్ద గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారంతో తనిఖీలు చేసి చింతకొమ్మదిన్నెకు చెందిన కవ్వాజి పవన్‌కుమార్, మద్దెల వెంకట రమణ, ఖాజీపేట మండలం కొమ్మలూరు గ్రామానికి చెందిన రాజోలు చంద్రశేఖర్‌రెడ్డి, కడప నగరం అక్కాయపల్లెకు చెందిన షేక్ ఇంతియాజ్, చింతకొమ్మదిన్నె మండలం కృష్ణాపురానికి చెందిన కె.వెంకటసాయి, చప్పిడి దేవేంద్ర కలిసి బద్వేల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి వద్ద కిలో గంజాయి రూ.15 వేలుకు కొనుగోలు చేశారన్నారు. వాటిని చిన్న 10 గ్రాముల ప్యాకెట్‌గా చేసి రూ.500కు కళాశాలలు, సర్కిల్‌ల్లో అమ్మేవారన్నారు. టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ విశ్వనాథరెడ్డి, ఎస్‌ఐ నరసింహ, సిబ్బంది దాడి చేసి మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారన్నారు. వారి నుంచి రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఇందిరానగర్‌లో.....
ఇందిరానగర్‌లో కడప ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ కృష్ణకుమార్ ఎస్‌ఐ మహేంద్ర సిబ్బంది దాడి చేసి గంజాయి విక్రయిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. చింతకొమ్మదిన్నె గ్రామానికి చెందిన తొండూరి అపెనుకొండ అలియాస్ బాబీ, కడప నగరం రాజీవ్ నగర్‌కు చెందిన గొడుగు అజీజ్ నుంచి కొని అక్కాయపల్లెకు చెందిన దేరంగుల పవన్ కళ్యాణ్, చెమ్ముమియ్యాపేటకు చెందిన ఓర్సు నరసింహ, పుట్లంపల్లెకు చెందిన పొడుతూరు గౌస్ మోహిద్దీన్ అమ్మకాలు సాగించేవారన్నారు. గంజాయి అమ్మకాలపై నిరంతరం తమ సిబ్బందితో నిఘా ఉంచామన్నారు. ప్రధాన నిందితుడు బద్వేలు ప్రాంతానికి చెందిన వ్యక్తి పరారీలో ఉన్నాడని త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. విద్యార్థులు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు.
నాలుగు కిలోల గంజాయి, ఏడు
ద్విచక్ర వాహనాలు, ఆటో స్వాధీనం