
ఉత్సాహంగా ఏసీఏ అండర్–19 క్రికెట్ మ్యాచ్
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్‌లు రెండో రోజున ఉత్సాహంగా సాగాయి. కెఓఆర్‌ఎం క్రికెట్ మైదానంలో నెల్లూరు– అనంతపురం జట్ల మధ్య మ్యాచ్ కొనసాగింది. 93 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మ్యాచ్ ప్రారంభించిన అనంతపురం జట్టు 60.2 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని టి.కిరణ్‌కుమార్ 66, సాత్విక్ 23 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని నేత్రానంద నాలుగు, విక్రాంత్‌రెడ్డి 2, రిత్విక్ రెండు వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 61 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఆ జట్టులోని గురు మోహన్ 66 పరుగులు, రిషికుమార్‌రెడ్డి 57 పరుగులు, చేశారు. అనంతపురం జట్టులోని దేవాన్ష్ 3 వికెట్లు తీశాడు. దీంతో నెల్లూరు జట్టు 246 పరుగుల అధిక్యంలో ఉంది. దీంతో రెండవ రోజు ఆట ముగిసింది.
వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీసీ స్టేడియంలో......
వైఎస్సార్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కడప– కర్నూలు జట్ల మధ్య మ్యాచ్ కొనసాగింది. రెండో రోజు శుక్రవారం 54 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మ్యాచ్ ప్రారంభించిన కడప జట్టు 51.2 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని సీఎండీ పైజాన్ 40, కశ్వప్‌రెడ్డి 23 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని వై.రిత్విక్ కల్యాణ్ ఐదు, సాయి విఘ్నేష్ 2, వివేక్ 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్నూలు జట్టు 57.5 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని రోహిత్ గౌడ్ 51 పరుగులు, హరిహరన్ 22 పరుగులు చేశారు. కడప జట్టులోని జయ ప్రణవ్ శ్రాస్తి 3 వికెట్లు, చెన్న కేశవ 2 వికెట్లు, గైబు 2 వికెట్లు తీశారు. దీంతో రెండవ రోజు ఆట ముగిసింది.

ఉత్సాహంగా ఏసీఏ అండర్–19 క్రికెట్ మ్యాచ్

ఉత్సాహంగా ఏసీఏ అండర్–19 క్రికెట్ మ్యాచ్