
పంజం సుకుమార్‌రెడ్డికి ప్రముఖుల నివాళి
రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు మండల వెస్సార్సీపీ సీనియర్ నాయకులు, మాజీ వ్యవసాయ సలహా మండలి చైర్మన్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజం సుకుమార్‌రెడ్డి (64) దశ దినకర్మల కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొన్నారు. టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ సీనియర్ రాష్ట్ర నాయకులు భూమన కరుణాకర్‌రెడ్డి, సాక్షి ఎడిటర్ రక్కాసి ధనుంజయరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు గురువారం పంజం చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ కుటుంబం వెంట నడుస్తూ పార్టీ పతిష్ఠతకు ఎంతో కృషి చేసారని వారు తెలిపారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ స్కిల్ డెవలప్‌మెంట్ చైర్మన్ కొండూరు అజయ్‌రెడ్డి, రామిరెడ్డి ధ్వజారెడ్డి, పంజం సందీప్‌రెడ్డి, సాయికిషోర్‌రెడ్డి, చెవుశ్రీనివాసులురెడ్డి, తోటశివసాయి, సీహెచ్‌రమేష్, మందలనాగేంద్ర, రంగారెడ్డి, నందాబాలా తదితరులు పాల్గొన్నారు.