
ఎకై ్సజ్ వాహనాల వేలంలో రూ.8లక్షల ఆదాయం
మదనపల్లె రూరల్ : సారా తరలిస్తూ ఎకై ్సజ్ నేరాల్లో పట్టుబడిన వాహనాలకు నిర్వహించిన వేలంపాటల్లో ప్రభుత్వానికి రూ.8,77,200 అదాయం లభించిందని జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మధుసూదన్ తెలిపారు. మదనపల్లె ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో సీఐ భీమలింగ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన వాహనాల వేలం పాటలకు 52మంది ధరావతు చెల్లించి పాల్గొన్నారు. మొత్తం 67 వాహనాలకు ప్రభుత్వం రూ.7,33,600 అప్‌సెట్ ధరగా నిర్ణయిస్తే... రూ.8,77,200కు పాడుకున్నారన్నారు. జీఎస్టీ కింద రూ.1లక్ష 57వేల 896 రూపాయలు వాహనాలు వేలం పాడుకున్న వారి నుంచి వసూలు చేశామన్నారు. ఎకై ్సజ్ ఎస్‌ఐ జబీవుల్లా, సిబ్బంది అలీ తదితరులు పాల్గొన్నారు.