
అటల్ ల్యాబ్‌ల బలోపేతమే లక్ష్యం
రాయచోటి : అటల్ టింకరింగ్ ల్యాబ్‌ల బలోపేతమే తమ లక్ష్యమని జిల్లా సైన్స్ అధికారి మార్ల ఓబుల్‌రెడ్డి తెలిపారు. విజయవాడ మేరీస్ స్టెల్లా కళాశాలలో జరిగే వర్క్‌షాప్‌కు ఆయనతోపాటు రీసోర్స్ పర్సన్లు శెట్టెం ఆంజనేయులు, షర్పుద్దీన్, వెంకటేశ్వర్లు, హేమంత్‌కుమార్, మనోహర్ హాజరయ్యారు. ఓబుల్‌రెడ్డి మాట్లాడుతూ పర్సన్స్‌కు శిక్షణ కార్యక్రమంలో డిజైన్ థింకింగ్, ఏఐ టూల్స్, ఎలక్ట్రానిక్స్, రాస్పు బెర్రీరై, సోలార్ పవర్ రోబోటిక్స్ కోడింగ్, అటల్ డాష్‌బోర్డు అంశాలపై శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. శిక్షణ అనంతరం అటల్ ల్యాబ్‌లలో విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి మార్గదర్శకత్వం వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.