
విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు
గాలివీడు : విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. మండలంలోని గాలివీడు నాలుగు రోడ్ల కూడలిలో 108 కార్యాలయం వద్ద గురువారం 63 కేబీఏ విద్యుత్ ట్రానన్స్‌ఫార్మర్‌లో న్యూట్రల్ ప్లగ్ వైర్లు తెగిపడ్డాయి. ఆయిల్ లీకేజీ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు పవర్ కట్‌చేసి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పెద్ద ప్రమాదమే తప్పిందంటూ స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.
వినూత్న నిరసన
రాజంపేట : పట్టణంలోని మున్సిపల్ కార్మికులు గురువారం మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నేత చిట్వేలి రవికుమార్, పీవీరమణ, లక్ష్మీదేవి, ప్రసాద్, సుధీర్, సాలమ్మ, వెంకటరమణ, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రబలిన విష జ్వరాలు
సిద్దవటం : మండలంలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. పల్లెల్లో అపరిశుభ్రత, నీరు కలుషితం కావడమే ఇందుకు కారణం. మండలంలోని సిద్ధవటం, జ్యోతి, వంతాటిపల్లె, బెటాలియన్ ప్రాంతాల్లో పలువురు విష జ్వరాల బారిన పడ్డారు. కొందరు సిద్దవటం ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం వైద్య సేవలకోసం తరలిరాగా, మరింత మంది కడపలోని ప్రైవేటు ఆసుపత్రులకు చికిత్స కోసం వెళ్లారు. మురుగు కాల్వలు, తాగునీటి ట్యాంకులు శుభ్రం చేయడం లేదని, అధికారుల నిర్లక్ష్యంతోనే జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయని స్థానికులు తెలిపారు. ఇప్పటికై నా వైద్య సిబ్బంది పర్యటించి రోగులకు సేవలందించాలని కోరుతున్నారు.
విద్యుత్ షాక్‌తో వృద్ధుడు మృతి
నందలూరు : మండలంలోని ఎగువ కుమ్మరపల్లె గ్రామంలో గురువారం సాయంత్రం మారం సుబ్రహ్మణ్యం(64) విద్యుత్ షాక్‌తో గురువారం మృతిచెందారు. మృతుడి కుమారుడు మారం శంకరయ్య వివరాల మేరకు.. తన తండ్రి సాయంత్రం ఆరు గంటల సమయంలో బహిర్భూమికి వెళ్లి ఓ పొలం నీటి తొట్టె వద్ద విద్యుత్ వైరు తగిలి షాక్‌కు గురయ్యారు. ఈ మేరకు స్థానిక పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.

విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు

విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు

విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు