
గడ్డివామి కింద పడి ఇద్దరు మృతి
రామసముద్రం : రామసముద్రం మండలం నారిగానిపల్లి సమీపంలోని కర్ణాటక సరిహద్దులో గడ్డివామి కింద పడి ఇద్దరు మృతిచెందిన సంఘటన బుధ వారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నా యి. నారిగానిపల్లికి చెందిన శ్రీరాములురెడ్డి(72), కర్ణాటక రాష్ట్రం వెళ్లి రాత్రి వస్తుండగా వర్షం ప్రారంభం కావడంతో ఆల్చేపల్లి సమీపంలో ఓ గడ్డివామి కిందకు వెళ్లి తలదాచుకున్నాడు. కర్ణాటక రాష్ట్రం చెన్నయ్యగారిపల్లికి చెందిన శంకర్రెడ్డి(55), గంగాపురానికి చెందిన రవి కూడా తలదాచుకున్నారు. అయితే ప్రమాదవశాత్తూ గడ్డివామి కుప్పకూలడంతో శ్రీరాములురెడ్డి, శంకర్రెడ్డి వామి కిందపడి అక్కడిక్కడే మృతిచెందారు. అక్కడే ఉన్న రవి ప్రమాదం నుంచి తప్పించుకుని వెళ్లి గ్రామస్థులకు సమాచారం ఇచ్చాడు. సంఘటన స్థలానికి చేరుకొన్న గ్రామస్తులు కూలిన గడ్డివామిని తొలగించి మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను గ్రామాలకు తరలించి పూడ్చివేశారు. వారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ప్రమాదవశాత్తు గడ్డివామి కింద పడి
ఇద్దరు మృతి

గడ్డివామి కింద పడి ఇద్దరు మృతి