
బాలికల వసతి గృహం తనిఖీ
మదనపల్లె రూరల్ : పట్టణంలోని బీసీ లేడీస్ హాస్టల్‌ను గురువారం సాయంత్రం జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మధుసూదన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ మొత్తం కలియదిరిగి, విద్యార్థులకు అందుతున్న వసతులను, సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థుల సమస్యలు తన దృష్టికి తేవాల్సిందిగా సూచించారు. హాస్టల్‌లో ఆర్వో ప్లాంటు లేకపోవడంతో పరిశుభ్రమైన తాగునీటిని తాగలేకపోతున్నామని, చన్నీళ్లతో స్నానం చేయడం కష్టంగా ఉందని, సోలార్ వాటర్ హీటర్స్ ఏర్పాటుచేయాలని కోరారు. హాస్టల్ కిటికీలకు మెస్ లేకపోవడంతో దోమల బెడద అధికంగా ఉందన్నారు. అనంతరం విద్యార్థినులతో కలిసి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మధుసూదన్, సీఐ భీమలింగ భోజనం చేశారు. మధుసూదన్ మాట్లాడుతూ...జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆదేశాల మేరకు...మదనపల్లె పర్యటనలో భాగంగా బీసీ హాస్టల్‌ను తనిఖీచేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ హేమావతి పాల్గొన్నారు.