
అందని సాయం
సాక్షి, రాయచోటి: ఖరీఫ్ కష్టకాలం కనిపిస్తోంది.. పంటలు వేసేందుకు పరిస్థితులు అనుకూలంగా లేవు... కరువు ఛాయలు కళ్లెదుటే కనిపిస్తున్నాయి..జులై 15 దాటినా పంట సాగు కాని పరిస్థితి చూస్తే కళ్లెదుటే ఖరీఫ్ కథ ముగిసేలా ఉంది. గత ఏడాది జిల్లాలో ఈ వర్షాధారం కింద సుమారు లక్ష ఎకరాలకు పైగా సాగు కావాలని వ్యవసాయ శాఖ సాధారణ లక్ష్యంగా నిర్ణయిస్తున్నా.. అనుకున్న మేర సాగు కనిపించడం లేదు.. గతేడాది లాగే ఈ సారి కూడా ఖరీఫ్ ఆశాజనకంగా కనిపించడం లేదు.జిల్లాలో ఖరీఫ్ సాగుకు సంబంధించి వేరుశనగ, కంది, వరి, ఉలవలు ఇలా అనేక రకాల పంటలను వర్షాధారం కింద సాగు చేస్తారు. జూన్ మొదటి నుంచి జులై 15 లోపు వర్షాధారం కింద మంచి అదునుగా భావిస్తారు. అయితే ఈ సారి ఇప్పటికి పదునైన వర్షం లేకపోగా అరకొర వర్షాలకు అంతంత మాత్రంగా పదుల సంఖ్యలో సాగైన పంట కూడా ఎండిపోతోంది. వేరుశనగకై తే జులై 15లోపు మంచి అదునును వ్యవసాయ శాఖ అధికారులు కూడా చెబుతున్నారు. ఇప్పటికీ అదును జాడ లేకపోవడంతో ఇక తరువాత వర్షాలు పడినా లేటు అదును కింద సాగు చేయాల్సిందే. అయితే ఇప్పటికప్పుడు వర్షాల జాడ కూడా కనిపించకపోవడం ఖరీఫ్ రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.
వర్షం కోసం ఎదురుచూపులు
జిల్లాలో ఖరీఫ్‌లో రైతులు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. గత ఏడాది కూడా అనుకున్న మేర వర్షాలు లేక పంటలు నిలువునా ఎండిపోయాయి. ఈసారి కూడా వర్షపు జాడ కనపడకపోవడంతో మరో మారు కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. ప్రతిసారి ప్రకతి కనిపించకపోవడంతో అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. ఇప్పటి వరకు వేరుశనగ, వరి, కంది తక్కువ ఎకరాలలో సాగయ్యాయి. ఈ ఖరీఫ్‌లో అన్నదాతలు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు.
వర్షపాతం వివరాలు
2024 జూన్‌లో 160.6 మిల్లీమీటర్లు, జూలైలో 47.5, ఆగస్టు 99.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమైదైంది. 2025 జూన్‌లో 75.1 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 24.8 మి.మీ కురిసింది. జూలైలో 90.5 మిల్లీమీటర్ల వర్షం కురువాలి.అయితే 2.3 మిల్లీమీటర్లు మాత్రమే కురసింది.
కందులు
సాధారణ సాగు:
2,404
హెక్టార్లు
ఇప్పటి వరకు
సాగైంది:
89హెక్టార్లు
వరి సాధారణ
సాగు:
11,432
హెక్టార్లు
సాగైంది:
537
హెక్టార్లు
వేరుశనగ
సాగు అంచనా: 38,013
హెక్టార్లు
సాగైన వేరుశనగ: 1,840
హెక్టార్లు
మొక్కజొన్న
సాధారణ సాగు:
1,911
హెక్టార్లు
సాగైంది:
543
హెకార్టు
జులై 15 దాటినా కనిపించని వర్షాలు
ఖరీఫ్ సీజన్లో విత్తనసాగుకు సన్నద్ధమైన రైతులు
వర్షం కోసం అన్నదాతలఎదురుచూపు
జిల్లాలో ఖరీఫ్ పంటలకు సంబంధించి పెట్టుబడి సాయం కింద గతంలో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం మే నెలలోనే రైతులకు రైతు భరోసా నిధులను అందించేది. తద్వారా పంటలు సాగు చేసేందుకు సులువుగా ఉండేది. ఎంతో కొంత పెట్టుబడి సొమ్ములు ఉండటంతో పంటలను సాగు చేసేవారు. అయితే 2024లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినా ఇప్పటి వరకు అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయలేదు. ఒకవైపు ఖరీఫ్.. వర్షం లేక మట్టి కొట్టుకుపోతుండగా మరోవైపు అన్నదాత సుఖీభవ నిధులు కూడా ప్రభుత్వం అందించకపోవడంతో రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలంలో ఉన్న రైతన్నను ఆదుకోవాల్సిన ప్రభుత్వం కనీసం ఇప్పటి వరకు నిధులు విడుదల చేయకపోవడంతో పెదవి విరుస్తున్నారు.
వేరుశనగ విత్తే పరిస్థితి లేదు..
వరుణ దేవుడు కరుణించక వేరుశనగ విత్తే పరిస్థితి కనిపించడం లేదు. మే నెలలో కురిసిన వర్షానికి దుక్కులు చేసి పెట్టుకున్నా.జూన్‌నుంచి ఇప్పటి వరకు చినుకు జాడ లేదు. కంది సాగయ్యే పరిస్థితులు లేవు. –పాలేపల్లె మోహన్ రెడ్డి(రైతు), మర్రిచెట్టు, లక్కిరెడ్డిపల్లె మండలం
అదునుదాటుతున్నా..
ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులైంది. అదును దాటుతున్నా అనుకున్న మేర వర్షం పడలేదు. ఇప్పటికే దుక్కులు దున్నాం. వర్షం కోసం ఎదురుచూస్తున్నాం. చినుకులు రాలితే విత్తనాలు వేయడానికి సిద్ధంగా ఉన్నాం.
–నాగేశ్వర, రైతు,మల్లూరు,చిన్నమండెం మండలం
వర్షం కోసం ఎదురుచూపు
నాకు 2 ఎకరాల పొలం ఉంది. మొదట వేరుశనగ అనుకున్నా.. అదును దాటిపోయింది కాబట్టి ప్ర త్యామ్నాయ పంటలు సాగు చే యాలన్న ఆలోచనలోఉన్నాం. ఎప్పుడెప్పుడు వర్షం పడుతుందా అని ఎదురుచూస్తున్నాం.
– గయాజ్‌బాషా, రైతు, గుర్రంకొండ మండలం

అందని సాయం

అందని సాయం

అందని సాయం

అందని సాయం

అందని సాయం

అందని సాయం

అందని సాయం

అందని సాయం

అందని సాయం