నాలుగు ఏఎంసీలకు చైర్మన్ల నియామకం | - | Sakshi
Sakshi News home page

నాలుగు ఏఎంసీలకు చైర్మన్ల నియామకం

Jul 18 2025 5:10 AM | Updated on Jul 18 2025 5:10 AM

నాలుగు ఏఎంసీలకు  చైర్మన్ల నియామకం

నాలుగు ఏఎంసీలకు చైర్మన్ల నియామకం

సాక్షి రాయచోటి: అన్నమయ్య జిల్లాతో పాటు వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలోని పలు మార్కెట్‌ యార్డ్‌ కమిటీలకు కూటమి సర్కార్‌ చైర్మన్‌ లను నియమించింది.. మదనపల్లె మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ పదవిని జనసేన పార్టీకి కేటాయించగా బద్వేలు మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ పదవిని బీజేపీకి కేటాయించారు.. వైఎస్‌ఆర్‌ కడప జిల్లా బద్వేలు మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌గా పి.విజయలక్ష్మి( బీజేపీ) , అన్నమయ్య జిల్లా రాయచోటి మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌గా బోడిరెడ్డి రాంప్రసాద్‌ రెడ్డి (టీడీపీ), అదే నియోజకవర్గంలో ఉన్న లక్కిరెడ్డిపల్లి మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌గా ఎస్‌ ఎండి షఫీ, మదనపల్లె మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌గా జంగాల శ్రీనివాస్‌( జనసేన)ను నియమించారు.. అందుకు సంబంధించి కూటమి ప్రభుత్వం పదవులకు సంబంధించి పేర్లు ప్రకటించింది.. అధికారికంగా ఆదేశాలు రావాల్సి ఉంది

గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టుకు దరఖాస్తు చేసుకోండి

రాజంపేట టౌన్‌: రాజంపేట పట్టణంలోని ఉర్దూ జూనియర్‌ కళాశాలలో ఖాళీగా ఉన్న ఎకనామిక్స్‌ అధ్యాపక పోస్టుకు గెస్ట్‌ఫ్యాకెల్టీగా పనిచేసుకునేందుకు ఈనెల 21వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌.సునీల్‌ బర్నబాస్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు 50 శాతం మార్కులతో ఎంఏ (ఎకనామిక్స్‌) ఉత్తీర్ణులై, డిగ్రీలో ఉర్దూ మీడియం చదివిన వారు లేక డిగ్రీలో ఉర్దూ లాంగ్వేజ్‌ సబ్జెక్టు చదివి ఉండాలన్నారు. ఆసక్తికలిగి, అర్హులైన వారు ఈనెల 21వ తేదీలోపు తమ దరఖాస్తును కళాశాలలోని కార్యాలయ పనివేళల్లో అందచేయాలన్నారు.ఈనెల 23వ తేదీ ఇంటర్వ్యూ ఉంటుందన్నారు. అభ్యర్థులు తమ వెంట విద్యార్హతకు సంబంధించి ఒరిజినల్‌, జిరాక్స్‌ కాపీలను తీసుకురావాలన్నారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో ని వారైనా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

బాలిక హత్యపై

స్పందించిన కమిషన్‌

కడప కోటిరెడ్డి సర్కిల్‌: గండికోటలో హత్యకు గురైన ఇంటర్‌ విద్యార్థిని సంఘటనపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ స్పందించింది. ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో చదువుతున్న వైష్ణవి ఇంటి నుంచి బయలుదేరి, ఆ తర్వాతకు హత్యకు గురైందని పత్రికల్లో వార్తలు ప్రచురితం కావడంతో కమిషన్‌ సుమోటోగా స్వీకరించింది. ఇంటర్‌ విద్యార్థిని చనిపోవడం బాధాకరమని, వారి తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని పేర్కొంది. ఎన్ని గంటలకు వెళ్లింది, ఎక్కడి నుంచి వెళ్లింది, సంఘటన జరగడానికి కారణాలు తదితరాలపై సమగ్ర విచారణ చేసి నివేదిక సమర్పించాలని జిల్లా పోలీసు అధికారులు, సంబంధిత అధికారులను కమిషన్‌ ఆదేశించింది.

రేపటి నుంచి తపాలా

సేవలకు అంతరాయం

రాజంపేట టౌన్‌: తపాలా కార్యాలయంలో ఈనెల 19 నుంచి 22వ తేదీ వరకు అన్ని రకాల సేవలు సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రాజంపేట హెడ్‌ పోస్టుమాస్టర్‌ షేక్‌ హబీబుల్లా తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు తపాలాశాఖను ఆధునికీకరిస్తున్నారన్నారు. ఈకారణంగా డేటా ట్రాన్స్‌ఫర్‌, సాంకేతిక మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈకారణంగా నాలుగు రోజుల పాటు తపాలా కార్యాలయాల్లో ఎలాంటి లావాదేవీలు ఉండవన్నారు. సాంకేతిక మరమ్మతులు పూర్తయితే 2.0 సాంకేతికత అందుబాటులోకి వస్తుందని, ఫలితంగా ఖాతాదారులకు అన్ని రకాల సేవలు వేగవంతం అవుతాయన్నారు. దీనివల్ల ఖాతాదారులకు మెరుగైన సేవలు అందుతాయన్నారు. సెల్‌ఫోన్‌ ద్వారానే ఆర్థిక, బీమా, బ్యాకింగ్‌ తదితర సేవలు అతి తక్కువ సమయంలో పూర్తవుతాయని తెలిపారు.

పాఠశాలల ఆకస్మిక తనిఖీ

సుండుపల్లె: మండల పరిధిలోని వెంగమరాజుపల్లె, గుల్లవాండ్లపల్లె, సుండుపల్లె మండల పరిషత్‌ ప్రాథమిక..ఆదర్శ పాఠశాలలను గురువారం జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల పరిసరాలను పరిశీలించారు.అనంతరం మాట్లాడుతూ విద్యార్థుల్లో భాషా నైపుణ్య అభివృద్ధి లక్ష్యంగా బోధన సాగించాలని, నూతన మార్పులకు అనుగుణంగా పిల్లల్లో సామర్థ్యాలను పెంపొందేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని చెప్పారు.సుండుపల్లె ఎంపీపీఎస్‌లో ఉపాధ్యాయుల కొరత ఉందని జిల్లా విద్యాశాఖాధికారి దృష్టికి ఉపాధ్యాయుడు రవీంద్రనాథ్‌రెడ్డి తీసుకెళ్లగా ఒకరిని కేటాయించారు. అనంతరం పిల్లల వర్క్‌ బుక్కులను డీఈఓ పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈఓలు వెంకటేష్‌నాయక్‌, రవీంద్రనాయక్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement