
ఘనంగా సద్గురు దర్గా స్వామి జయంతి
రామాపురం (రాయచోటి జగదాంబసెంటర్): రామాపురం మండలం నీలకంఠ్రావుపేట గ్రామంలోని సాయి నగర్‌లో వెలసిన శ్రీ సద్గురు దర్గా స్వామీజీ 95వ జయంతిని బుధవారం నిర్వాహకులు వైభవంగా నిర్వహించారు. పరిపూర్ణతరుడు, పరబ్రహ్మ స్వరూపుడు, పరమాత్ముడు, దత్త స్వరూపుడు అయిన సమర్థ దర్గా స్వామీజీ జయంతి వేడుకలకు పలు ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. సద్గురువు అయినటువంటి దర్గా స్వామీజీ ఆశీస్సులను వారు పొందారు.
సికింద్రాబాద్ – తిరుపతి
మధ్య ప్రత్యేక రైలు
కడప కోటిరెడ్డి సర్కిల్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ – తిరుపతి మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నారని కడప రైల్వే కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ జనార్థన్ తెలిపారు. 07009 నంబరుగల రైలు ప్రతి గురువారం సికింద్రాబాద్‌లో ఈనెల 31, ఆగస్ట్ 7, 14, 21, 28వ తేదీల్లో, 07010 నంబరు గల రైలు తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ప్రతి శుక్రవారం ఆగస్ట్ 1, 8, 15, 22, 29వ తేదీల్లో నడుస్తుందన్నారు. సికింద్రాబాద్‌లో ప్రతి గురువారం రాత్రి 10గంటలకు బయలుదేరి కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల మీదుగా కడపకు ఉదయం 7.05గంటలకు చేరుకుని, రాజంపేట, రేణిగుంట మీదుగా తిరుపతికి ఉదయం 10.30గంటలకు చేరుకుంటుందన్నారు. అలాగే ప్రతి శుక్రవారం తిరుపతిలో సాయంత్రం 4.40గంటలకు బయలుదేరి ఇదే మార్గంలో సికింద్రాబాద్‌కు ఉదయం 6.45గంటలకు చేరుతుందని ఆయన తెలిపారు.