
టీడీపీ కుట్రలు భగ్నం
మండల వైస్ ఎంపీపీ వైఎస్సార్‌సీపీదే
సంబేపల్లె: సంబేపల్లె మండల పరిషత్ ఉపాధ్యక్షుడు–1 పదవి కోసం టీడీపీ చేసిన కుట్రలు భగ్నమయ్యాయి. సంఖ్యాబలం లేకపోయినా వైస్ ఎంపీపీ ఎన్నికల్లో రాజకీయ కుట్రకు తెరలేపింది. వైఎస్సార్‌పీకి చెందిన ఎంపీటీసీలను మభ్యపెట్టి, భయపెట్టి స్థానాన్ని కై వసం చేసుకునే ప్రయత్నం చేసిన అధికార పార్టీ విఫలమైంది. వైఎస్సార్‌సీపీ గుర్తుతో గెలిచిన ఎంపీటీసీలు పార్టీ నిర్ణయానికి కట్టుబడి అధిష్టానం సూచించిన అభ్యర్థిని గెలిపించుకున్నారు. ఇటీవల వైస్ ఎంపీపీ రాజీనామ చేయంతో ఆ స్థానం ఖాళీ ఏర్పడింది. బుధవారం డీఎల్‌డీఓ లక్ష్మీపతి అధ్యక్షతన పోలీసు బందోబస్తు నడుమ ఎన్నిక నిర్వహించారు. ఆరుగురు సభ్యులు హాజరయ్యారు. నాగిరెడ్డిగారిపల్లె ఎంపీటీసీ జి. రమాదేవి ప్రతిపాదన మేరకు గున్నికుంట్ల ఎంపీటీసీ కె.శ్రీధర్‌రెడ్డి పోటీలో నిలిచారు.దుద్యాల ఎంపీటీసీ ఎం. భాగ్యమ్మ, నారాయణరెడ్డిపల్లె ఎంపీటీసీ డి రాజకుమారి, రౌతుకుంట ఎంపీటీసీ చిన్న భద్రయ్య, శెట్టిపల్లె యం.సీతమ్మలు బలపరిచారు. ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయకపోవండతో ఏకగ్రీవంగా మండల ఉపాధ్యక్షుడిగా కేతంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఎన్నికై నట్లు ఎన్నికల అధికారులు డిక్లరేషన్ పత్రాన్ని అందజేశారు.