
వాడిని ఊరికే వదల కూడదు
ముందు మూడు వేలు చెల్లించి వంద డేటా ఫారాలను అతి కష్టం మీద రాయాలి. వేళ్లు నొప్పి పుట్టేవి...ఆపై తప్పులు లేకుండా ఏకాగ్రతతో రాయడం వల్ల కళ్లు కూడా మసకబారేవి. ఇంటివద్ద ఖాలీగా ఉంటున్నాం. ఏదో ఒకపని పార్ట్ టైమ్‌గా చేయడం ద్వారా కొంత ఆదాయం వస్తుందని ఆశపడి ఈపని చేస్తే మహిళలన్న జాలి కూడా లేకుండా నిర్వాహకుడు మోసం చేశాడు. ఇలాంటి వాడిని ఊరికే వదలకూడదు.
–తులసి, నీరుగట్టువారిపల్లె, మదనపల్లె
వంద ఫారాలు రాస్తే
రూ. 5 వేలు అన్నారు
ముందుగా రూ.3 వేలు చెల్లిస్తే నిర్వాహకులు రిజిస్ట్రేషన్ చేసుకుని వంద డేటా ఎంట్రీ ఫారాలు ఇస్తా రు. వీటికి రెండు వైపులా వారిచ్చిన సంఖ్యలు రాయాలి. వాటిని తెచ్చి అన్ని కరెక్టుగా ఉంటే రూ.5 వేలు ఇస్తారు. ఇలా కొందరికి మాత్రమే ఇచ్చారు. బాధితులంతా సామాన్య, మధ్యతరగతి వారే. మాకు న్యాయం చేయాలి. –సబిహా, బాధితురాలు, మదనపల్లె
బాధితులకు న్యాయం
జరిగేలా చూస్తాం
జిల్లాలోని వివిధ ప్రాంతాల వారే కాకుండా కర్నాటకలోని రాయల్పాడు ప్రాంతం వారు కూడా బాధితులుగా ఉన్నారు. ఇంతగా మహిళలుమోసం పోవడం విచిత్రంగా ఉంది. బుధవారం ఒక్క రోజే 200 మందికి పైగా బాధితులు వచ్చారు. ఫిర్యాదులు తీసుకున్నాం. ఎలైవ్ క్రూవ్స్ డేటా నిర్వాహకులు బెంగళూరు వాసి. ఇతనిపై కేసు నమోదు చేశాం. ఇతని కోసం ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశాం. ఇంకా బాధితులు ఉంటే ఫిర్యాదు చేయవచ్చు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం. –సత్యనారాయణ,
రూరల్ సర్కిల్ సీఐ, మదనపల్లె

వాడిని ఊరికే వదల కూడదు

వాడిని ఊరికే వదల కూడదు