పెనగలూరు : పెనగలూరు పోలీస్ స్టేషన్ మరమ్మతులకు కొత్తపల్లి గ్రామానికి చెందిన తలమంచి గిరీష్‌రెడ్డి రూ.10 లక్షలు వితరణచేశారు. 988లో నిర్మించిన పెనగలూరు పోలీసు స్టేషన్ భవనాలకు ఇప్పటివరకూ ఎలాంటి మరమ్మతులు చేయలేదు. ఎస్‌ఐకు కేటాయించిన గది కూడా శిథిలావస్థకు చేరుకుంది. 37 సంవత్సరాల స్టేషన్‌ను ఎస్‌ఐ రవిప్రకాష్‌రెడ్డి చొరవ తీసుకుని రీ మోడలింగ్ చేయిస్తున్నారు. దాతల సహకారం కోరడంతో గిరీష్‌రెడ్డి ముందుకు వచ్చి రూ.10 లక్షలు అందజేశారు. దీంతో నూతన విద్యుత్తు లైన్లు, దీపాలు వేయించారు. మరుగుదొడ్డి గదికి మరమ్మతు లు చేయించారు. కంప్యూటర్ రూమ్‌లో టేబుల్, స్టేషన్ గది ఎదుట టైల్స్, ఉత్తరం వైపున సిమెంట్ ఫ్లోరింగ్, రిజిష్టర్లు పెట్టుకునేందుకు షెల్ఫ్ ఏర్పాటు చే యించారు. ఈ సందర్భంగా గిరీష్‌రెడ్డిని పోలీసులు బుధవారం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సిబ్బంది, కొత్తపల్లి యూత్ సభ్యులు పాల్గొన్నారు.