
నకిలీ పత్రాలతో నిరుద్యోగులకు వల
రాయచోటి : నకిలీ కంపెనీలు చూపి ఉద్యోగాలిస్తామంటూ నిరుద్యోగ యువతకు మోసగాళ్లు వల వేస్తున్నారని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఓ ప్రకటనలో సూచించారు. నకిలీ కంపెనీలు, ఫేక్ నోటిఫికేషన్లు, జాతీయ, అంతర్జాతీయ ఉద్యోగావకాశాల పేరిట మోసగాళ్లు డబ్బు వసూలు చేస్తున్నారన్నారు. ఎక్కువమంది యువత అధిక ఆదాయం ఆశతో మోసానికి గరవుతున్నారన్నారు. యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, ఏపీపిఎస్‌సీ వంటి సంస్థల పేరుతో ఫేక్ అపాయింట్‌మెంట్ లెటర్లు సృష్టిస్తున్నట్లు తెలిపారు. ఒక్కసారి ఫీజు చెల్లిస్తే ఉద్యోగం ఖాయం అనే నకిలీ వెబ్‌సైట్లు, డొమెయిన్ ఉపయోగించడం, ఐటీ ఇతర దేశాల్లో ఉద్యోగాలున్నాయని నమ్మబలకడం చేస్తున్నారని తెలిపారు. ప్రాసెసింగ్ ఫీజు, వీసా చార్జీలు పేరిట పెద్దమొత్తంలో డబ్బులు వసూళ్లు చేస్తారన్నారు. ఇంటర్వ్యూ లేకుండా నేరుగా ఆఫర్ లెటర్ పంపించే విషయంపై అప్రమత్తంగా ఉండాలని, జాబ్ అప్లికేషన్ పేరిట వ్యక్తిగత డేటా తీసుకొని అక్రమాలకు ఉపయోగిస్తారని పేర్కొన్నారు. బ్యాంక్ డీటెయిల్స్, ఓటీపీలు, ఆథార్ కార్డు, పాన్ కార్డు సమాచారం తీసుకుంటారు జాగ్రత్తగా ఉండాలన్నారు. అధికారిక వెబ్‌సైట్లలో పరిశీలించాలని, వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ డీటెయిల్స్ ఎవరికీ పంపించరాదన్నారు. ఎవరికై నా సమస్య తలెత్తితే సైబర్ హెల్ప్‌లైన్ 1930, సైబర్ క్రైమ్ పోర్టల్ సైబర్‌క్రైమ్. జీఓవి.ఇన్, అత్యవసర సమాచారం కోసం మీ సమీప పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ సెల్‌ను సంప్రదించాలన్నారు.
జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు