
మున్సిపల్ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన
రాజంపేట : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాజంపేట మున్సిపల్ కార్మికులు బుధవారం అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు చిట్వేలి రవికుమార్ మాట్లాడుతూ జీవో నెంబర్–36 ప్రకారం వేతనాలు పెంచాలని కేటగిరీ నిర్ణయంలో పొరపాట్లు సరిదిద్దాలని డిమాండ్ చేశారు. షరతులు లేకుండా ఇంజినీరింగ్, కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తింప చేయాలన్నారు. వయోపరిమితి 62ఏళ్లకు పెంచాలని, గ్రాట్యూటీ చెల్లించాలని కోరారు. చట్టబద్ధమైన సెలవులు ఇవ్వాలని, 20 రోజులుగా ఆందోళన చేస్తున్నా.. కూటమి ప్రభుత్వానికి చీమకుట్టినట్‌లైనా లేదన్నారు. ఏపీ ఎన్‌జీవో జెఎసీ కన్వీనర్ ఎస్వీ.రమణ, అధ్యక్షుడు హరిప్రసాద్ వీరికి సంఘీభావం తెలిపారు. పీవీరమణ, లక్ష్మీదేవి, ప్రసాద్, ఓబయ్య పాల్గొన్నారు.