
బాధిత కుటుంబాలకు అండగా నిలబడాలి
రాజంపేట: రెడ్డిపల్లె చెరువుకట్టపై జరిగిన లారీ బోల్తా ప్రమాద దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలబడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి అన్నారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఽడ సంతాపాన్ని తెలియచేస్తున్నామన్నారు. శెట్టిగుంట గ్రామంలో కూలీనాలీ చేసుకుని జీవించే పేదలు మృతి చెందడం బాధాకరమన్నారు. శెట్టిగుంటకు చెందిన గిరిజన ప్రమాద బాధితుల కుటుంబాలు మళ్లీ ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రభుత్వం మానవత్వంతో సాయం చేయాలన్నారు. గతంలో ఇలాంటి ప్రమాదాలలో మృతిచెందిన వారికి ఏ విధంగా ప్రభుత్వాలు ఆర్థికసాయం చేశారో అదే విధంగా ఇప్పటి ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలన్నారు.