
వీరభద్రస్వామికి కిలో వెండి వితరణ
రాయచోటి టౌన్: రాయచోటి శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి వారికి భక్తులు కిలో వెండిని వితరణగా అందజేశారు. శుక్రవారం కర్నాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లాకు చెందిన గురుమూర్తయ్య, చతురాచారి మట్‌లతో పాటు వారి కుటుంబ సభ్యులు స్వామి వారికి కిలో వెండిని సమర్పించారని ఆలయ ఈవో డీవీ రమణారెడ్డి తెలిపారు. . దీనికి సంబంధించి ఆలయ అధికారులు రశీదును అందజేశారు. వీరి పేరున అర్చకులు స్వామి వారికి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. తీర్థప్రాసాదాలు అందజేశారు.
విరబూసిన బ్రహ్మకమలాలు
రామసముద్రం: రామసముద్రం మండల కేంద్రంలోని బయన్న ఇంటి ఆవరణలో బ్రహ్మకమలం పుష్పాలు గురువారం రాత్రి విరబూశాయి. వారి ఇంటి పెరట్లో ఉన్న బ్రహ్మ కమలం చెట్టుకు సుమారు 15 పుష్పాలు పూశాయి. చుట్టుపక్కల ప్రాంతాలల ప్రజలు వీటిని చూసేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రతి ఏటా పుష్పాలు పూస్తాయని కుటుంబీకులు తెలిపారు.
జిల్లాలో వర్షం
రాయచోటి: జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి వర్షపు జల్లులు పడ్డాయి. ఖరీఫ్ సీజన్ దాటిపోతున్న సమయంలో కురిసిన వర్షం వల్ల ఎలాంటి లాభం లేదని రైతులు మదనపడుతున్నారు. వేరుశనగ, కంది లాంటి వర్షాధార పంటలు ప్రస్తుతం సాగుచేస్తే తెలుళ్ల కారణంగా భారీగా నష్టాలు వస్తాయని చెబుతున్నారు. గురువారం రాత్రి కురిసిన వర్షాలకు వాతావరణం చల్లబడింది. శుక్రవారం సాయంత్రం కూడా జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు కురిశాయి. వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. టి సుండుపల్లిలో 86.4 మిల్లీమీటర్లు, కేవీ పల్లిలో 85.2, నందలూరులో 67, పీలేరులో 66, వీరబల్లిలో 59.2, పెనగలూరులో 33.8, మదనపల్లెలో 32.6, ఓబులవారిపల్లిలో 30.6, చిట్వేలిలో 24.8, పుల్లంపేటలో 22.8, కోడూరులో 20.4, రాజంపేటలో 19, రామసముద్రంలో 17.2, రామాపురంలో 13, కలికిరిలో 12.4, సంబేపల్లిలో 12.4, పెద్దమండెంలో 10.8, రాయచోటిలో 10 మిల్లీమీటర్ల వంతున వర్షపాతం నమోదైంది.
డెయిరీ స్థలంలో బోర్డుల
ఏర్పాటుపై సర్వే
మదనపల్లె రూరల్: అమూల్ డెయిరీ స్థలంలో ప్రైవేట్ వెంచర్‌కు చెందిన వ్యక్తులు రియల్ ఎస్టేట్‌కు సంబంధించి ప్రచార బోర్డులు ఏర్పాటుచేశారని ‘సాక్షి’శుక్రవారం ప్రచురితమైన కథనంపై రెవెన్యూ అధికారులు స్పందించారు. మండల తహసీల్దార్ కిషోర్‌కుమార్‌రెడ్డి ఆదేశాలతో... ఆర్‌ఐ బాలసుబ్రహ్మణ్యం, సర్వేయర్ సుబ్రహ్మణ్యం, వీఆర్వో, పంచాయతీ సెక్రటరీ తదితరులు సంబంధిత స్థలంలో జాయింట్ సర్వే నిర్వహించారు. రెవెన్యూ రికార్డుల్లో నేషనల్ హైవే ఎంతవరకు ఉందో, అంతవరకు కొలతలు వేసి హద్దులను మార్కింగ్ చేశారు. అడ్వర్‌టైజ్‌మెంట్ బోర్డులు ఆర్‌అండ్‌బీ స్థలంలో ఉన్నట్లు నిర్ధారించారు. బోర్డులు ఏర్పాటుచేసిన వ్యక్తులకు నోటీసులు జారీచేసి, పంచాయతీకి పన్ను కట్టించుకోవాల్సిందిగా కార్యదర్శికి సూచించారు. అయితే..రియల్టర్లు డెయిరీకి, బెంగళూరు ప్రధాన రహదారికి మధ్య తమకు చెందిన 7 సెంట్ల స్థలం ఉందని, అందులోనే బోర్డులు ఏర్పాటుచేసుకున్నామని తెలిపారు.

వీరభద్రస్వామికి కిలో వెండి వితరణ

వీరభద్రస్వామికి కిలో వెండి వితరణ

వీరభద్రస్వామికి కిలో వెండి వితరణ