
పక్కాగృహాల నిర్మాణం వేగవంతం చేయాలి
పెద్దమండ్యం: లే అవుట్‌లలో పక్కాగృహాల నిర్మాణం పనులను వేగవంతం చేయాలని జిల్లా సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరక్టర్ ఎస్. కృష్ణ అన్నారు. మండలంలోని తురకపల్లెకు శుక్రవారం విచ్చేశారు. శిద్దవరంలో కస్తూర్భా విద్యాలయం, కలిచెర్లలో బీసీ హాస్టల్, పెద్దమండ్యంలో 1, 2 అంగన్‌వాడీ కేంద్రాలు, మోడల్ పాఠశాల, వసతి గృహం, ప్రాథమిక పాఠశాల, లేఅవుట్‌లో పక్కాగృహాల నిర్మాణం, పీహెచ్‌సీని ఆయన తనిఖీ చేశారు. లే అవుట్‌లో మంజూరైన పక్కాగృహాలు ఎన్ని, గృహాల నిర్మాణం పనులు ఎలా జరుగుతున్నాయని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పక్కాగృహాల నిర్మాణాలు వేగవంతం చేయాలని ఆదేశించారు. పీహెచ్‌సీకి వచ్చే రోగుల సంఖ్య, అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పాఠశాలలో సౌకర్యాపై విద్యార్థులతో మాట్లాడారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం గురించి అడిగి తెలుసుకున్నారు. కలిచెర్లలో బీసీ హాస్టల్‌ను తనిఖీ చేశారు. హాస్టల్ ఉన్న విద్యార్థుల సంఖ్య, ఉన్న వసతులపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీధర్‌రావు, ఏఈ అక్రమ్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.