
దృఢత్వానికి ప్రతీక భారతి ఆల్ట్రాఫాస్ట్ సిమెంట్
పీలేరు రూరల్ : నమ్మకానికి, దృఢత్వానికి ప్రతీక భారతి ఆల్ట్రాఫాస్ట్ సిమెంట్ అని ఆ సంస్థ టెక్నికల్ మేనేజర్ సి.ఛాయాపతి తెలిపారు. బుధవారం పీలేరు పట్టణం తిరుపతి రోడ్డు మార్గంలో డీలర్లు, భవన నిర్మాణ కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్మనీ టెక్నాలజీ, రోబోటిక్ క్వాలిటీ కంట్రోల్ ఇంజినీరింగ్ నిపుణుల పర్యవేక్షణలో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాల భారతి ఆల్ట్రా ఫాస్ట్ సిమెంట్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించారు. టెంపర్ ఫ్రూప్ బస్తాలతో మార్కెట్‌లోకి వస్తుండడంతో తూకం తగ్గే అవకాశం ఉండదన్నారు. సిమెంట్ రంగంలో భారతి సిమెంట్ అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. భారతి సిమెంట్‌కు సంబంధించి నాణ్యతా ప్రమాణాలు, విశిష్టత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. భారతి ఆల్ట్రా ఫాస్ట్ సిమెంట్ తయారవుతున్న విధానం, భవన నిర్మాణ కార్మికులు పాటించాల్సిన జాగ్రత్తలు గూర్చి వివరించారు. వినియోగదారుల సౌలభ్యం కోసం భారతి సిమెంట్ ప్రతి చోటా అందుబాటులో ఉండేలా డీలర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం తాపీ మేసీ్త్రలకు రూ.లక్ష ప్రమాద భీమా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీలర్లు సిమెంట్ మోహన్‌రెడ్డి, ఇనాయతుల్లా, కార్మికులు పాల్గొన్నారు.