
మృతుల కుటుంబాలకు పరిహారమేది !
రాజంపేట : ప్రమాదం జరిగి 12 గంటలవుతున్న లారీ బోల్తా మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించకపోవడం కూటమి ప్రభుత్వ నిరంకుశపాలనకు నిదర్శనమని రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే , వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికారప్రతినిధి కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. రాజంపేట ప్రాంతీయవైద్యశాలలో చికిత్స పొందుతున్న వారిని కొరముట్ల పరామర్శించారు. అధికారులు, నామమాత్రంగా వచ్చి వెళ్లారన్నారు. నష్టపరిహారం ప్రకటించకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని చెప్పడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. గతంలో ఇదే తరహాలో ప్రమాదం జరిగితే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 24 గంటలు గడవకముందే బాధితులకు రూ.10లక్షలు ప్రకటించారన్నారు. ఇలాంటి ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, నేను అనేకసార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రి గడ్కరీని కలిసి రూ.2,300కోట్లు కడప–రేణిగుంట వరకు గ్రీన్ ఎక్స్‌ప్రెస్ హైవేని మంజూరు చేయించామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న ఇంతవరకు హై వే పనులు మొదలుకాలేదన్నారు. రైల్వేకోడూరు వైస్‌ఎంపీపీ ధ్వజారెడ్డి, సాయికిషోర్‌రెడ్డి, చెవ్వు శ్రీనివాసులరెడ్డి,జిల్లా యువజ న విభాగం అధ్యక్షుడు శివారెడ్డి, జెడ్పీటీసీ ర త్న మ్మ, మాజీ జడ్పీటీసీ రాజేశ్వరమ్మ పాల్గొన్నారు. క్షతగాత్రులను బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిలోకేష్,జనసేన పార్లమెంటరీ ఇన్‌చార్జి శ్రీనివాసరాజు, సీపీఎం నేతలు చంద్రశేఖర్, రవికుమార్ పరామర్శించారు. రాజంపేట ఏరియా హాస్పిటల్‌లో మృతదేహాలకు పోస్టుమార్టరం పూర్తి చేశారు. వారి బంధువులకు అప్పగించారు.ప్రాణాలతో బయటపడిన చిన్నారులను ప్రతి ఒక్కరూ పరామర్శిస్తున్నారు.
మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు