
ఒంటిమిట్టలో పూర్తిస్థాయిలో అన్నప్రసాద వితరణకు చర్యలు
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో భక్తులకు పూర్తిస్థాయిలో అన్నప్రసాద వితరణకు చర్యలు చేపట్టాలని టీటీడీ ఈఓ శ్యామలరావు అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని కార్యనిర్వహణాధికారి ఛాంబర్‌లో జేఈఓ వి.వీరబ్రహ్మంతో కలిసి సోమవారం అధికారులతో ఈఓ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ ఒంటిమిట్టలో ఏప్రిల్ 11వ తేదీన జరిగిన కోదండరామస్వామి కల్యాణోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల తరహాలో ఒంటిమిట్టలో భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేయాలని ఆదేశించిన నేపథ్యంలో ఆలయం వద్ద తాత్కాలికంగా జర్మన్ షెడ్లు ఏర్పాటు చేసి ఆగస్టు నుంచి అన్న ప్రసాదాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసేందుకు ఇంజినీరింగ్, అన్న ప్రసాదాల విభాగం అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో ఎఫ్‌ఏ అండ్ సిఏఓ బాలాజీ, సిఈ టివి సత్యనారాయణ, ఎస్‌ఈలు జగదీశ్వర్ రెడ్డి, మనోహరం, అన్నప్రసాదం, డిప్యూటీ ఈఓ రాజేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ఈఓ జె శ్యామలరావు