గ్రామకంఠం భూమి కబ్జా | - | Sakshi
Sakshi News home page

గ్రామకంఠం భూమి కబ్జా

Jul 15 2025 6:31 AM | Updated on Jul 15 2025 6:31 AM

గ్రామ

గ్రామకంఠం భూమి కబ్జా

పుల్లంపేట : మండల పరిధిలోని రామక్కపల్లిలో సత్యమ్మ దేవతకు చెందిన గ్రామ కంఠం భూమి కబ్జా చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ మేరకు వారు సోమవారం డిప్యూటీ తహసీల్దార్‌, మండల అభివృద్ధి అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామకంఠం భూమికి తమ విన్నపాల మేరకు గ్రామ రెవెన్యూ అధికారులు అనేక సార్లు సర్వే చేసి హద్దులు నిర్ణయించారని తెలిపారు. అయినా ఆకేపాటి రామచంద్రారెడ్డి తన బంధు వర్గానికి చెందిన ఉన్నతాధికారుల బలం ఉందని.. పదేపదే రెవెన్యూ అధికారులను సైతం లెక్క చేయకుండా కొలతలు కొలిచి నాటిన హద్దు రాళ్లను జేసీబీ సాయంతో తొలగించి పొలం దున్నడం జరిగిందని పేర్కొన్నారు. అలాగే గ్రామస్తులు పురాతన బావిని వెలికి తీసినప్పటికీ ఎటువంటి సమాచారం అందించకుండా గ్రామకంఠంలో ఉన్న బావిని దౌర్జన్యంగా పూడ్చివేయడం జరిగిందన్నారు. పంచాయతీ నిధులతో ఏర్పాటు చేసిన సిమెంట్‌ రోడ్డును సైతం పగులకొట్టి సిమెంటు రోడ్డుపై పెన్సింగ్‌ నిర్మించారన్నారు. ఈ విషయాలపై ఆకేపాటి రామచంద్రారెడ్డిని సంప్రదిస్తే గ్రామస్తులను దుర్భాషలాడుతూ, దౌర్జన్యానికి దిగుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కావున రెవెన్యూ అధికారులు స్పందించి సదరు వ్యక్తిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకొని, గ్రామకంఠం భూమిని కాపాడాలని కోరారు. ఇందుకు స్పందించిన డిప్యూటీ తహసీల్దార్‌, మండల అభివృద్ధి అధికారి గ్రామస్తులకు న్యాయం చేస్తామని తెలియజేవారు.

డెంగీ జ్వరంతో అంగన్వాడీ టీచర్‌ మృతి

సుండుపల్లె : డెంగీ జ్వరంతో అంగన్వాడీ టీచర్‌ మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని జి.రెడ్డివారిపల్లె గ్రామ పంచాయతీ కొరిమివాండ్లపల్లెలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఉమ్మడిశెట్టి లక్ష్మీప్రసన్న(35) కొరివివాండ్లపల్లెలో అంగన్వాడీ టీచర్‌గా విధులు నిర్వహిస్తుండే వారు. ఆమెకు వారం క్రితం జ్వరం వచ్చింది. సుండుపల్లె, పీలేరులలోని ఆసుపత్రులలో చికిత్స పొందింది. రక్తపరీక్షలలో డెంగీ జ్వరం అని తేలడంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతి స్విమ్స్‌కు వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్నా పరిస్థితి విషమించడంతో సోమవారం మరణించింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

దుర్గలమ్మ ఊరేగింపులో ఘర్షణ

రామసముద్రం : రామసముద్రం మండల కేంద్రంలో ఆదివారం జరిగిన దుర్గలమ్మ అమ్మవారి ఊరేగింపులో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎస్‌ఐ రమేష్‌బాబు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బీసీ కాలనీకి చెందిన ధనుష్‌ అమ్మవారి ఊరేగింపులో డ్యాన్స్‌ వేస్తుండగా.. ఎగువ పెట్రోల్‌ బంక్‌ వద్ద దిగువపాళెంకు చెందిన జగన్‌తోపాటు మరో ఇద్దరు ధనుష్‌పై బ్లేడ్‌తో దాడి చేశారు. ఈ దాడిలో ధనుష్‌ చెవుపైన, మెడ, వీపుపై రక్త గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గాయపడిన ధనుష్‌ను రామసముద్రం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ముగ్గరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

కాపాడాలని అధికారులకు గ్రామస్తుల ఫిర్యాదు

ఒకరికి తీవ్ర గాయాలు

గ్రామకంఠం భూమి కబ్జా1
1/2

గ్రామకంఠం భూమి కబ్జా

గ్రామకంఠం భూమి కబ్జా2
2/2

గ్రామకంఠం భూమి కబ్జా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement