
ఇదేం ప్రయాణం.. ప్రాణాలకే ప్రమాదం
ముదివేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ మార్గంలో ఆదివారం ఐదుగురు యువకులు ఒకే బైక్‌పై ఓవర్ స్పీడుగా వెళ్లడం ఆశ్చర్యాన్ని కల్గించింది. వీరి రైడింగ్ భయ భ్రాంతులకు గురి చేసింది. వంద కిలోమీటర్ల వేగంతో.. సౌండ్ చేస్తూ.. ఆపై గోల చేస్తూ వెళ్లారు. బైక్ ఏమాత్రం అదుపు తప్పినా.. వారి ప్రాణాలకే ప్రమాదమనే సంగతిని వారు మరిచిపోయారు. ఇది అన్నమయ్య జిల్లాలో వైరల్‌గానే కాకుండా హల్ చల్‌గా మారింది. ఈ విషయమై ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌ను వివరణ అడగగా.. వీరి కోసం అన్వేషిస్తున్నట్లు తెలిపారు. తగు చర్యలు తీసుకుంటామన్నారు. బైక్‌ను స్వాధీనం చేసుకుంటామన్నారు.
– కురబలకోట