రైలులో నుంచి పడి వృద్ధుడికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

రైలులో నుంచి పడి వృద్ధుడికి గాయాలు

Jul 14 2025 4:49 AM | Updated on Jul 14 2025 4:49 AM

రైలుల

రైలులో నుంచి పడి వృద్ధుడికి గాయాలు

మదనపల్లె రూరల్‌ : రైలులో నుంచి ప్రమాదవశాత్తు పడి వృద్ధుడు తీవ్రంగా గాయపడిన ఘటన శనివారం రాత్రి కురబలకోట మండలంలో జరిగింది. కర్ణాటకలోని కోలారుజిల్లా బాగేపల్లె తాలూకా బోపనపల్లె క్రాస్‌ కాలనీకి చెందిన చిన్నవెంకటనరసప్ప కుమారుడు టి.కదిరప్ప (65) నెలరోజుల క్రితం ఇంటి నుంచి వచ్చేసి భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి తిరుపతి నుంచి గుంతకల్లు వెళ్లే ప్యాసింజర్‌ రైలులో ప్రయాణిస్తుండగా, బాత్‌రూమ్‌ వెళ్లేందుకు ప్రయత్నిస్తూ.. రైలు డోరు వైపు వెళ్లడంతో కురబలకోట బ్రిడ్జి వద్ద జారి కిందకు పడ్డాడు. ప్రమాదంలో కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న రైల్వేహెడ్‌కానిస్టేబుల్‌ మహబూబ్‌బాషా నిందితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. కేసు విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

కడప పాఠశాలకు

రాష్ట్ర స్థాయి గుర్తింపు

కడప ఎడ్యుకేషన్‌ : కడప నగర పాలక సంస్థ పరిధిలోని సాయిపేట 8వ వార్డు ఆదర్శ ప్రాథమిక పాఠశాలకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ నెల 10వ తేదీన నిర్వహించిన మెగా పేరెంట్స్‌ టీచర్స్‌ (మెగా పీటీఎం 2.0) సమావేశంలో విద్యార్థులు, తల్లిదండ్రులకు సంబంధించిన ఫొటో ఫ్రేమ్‌ రూపకల్పనలో పాఠశాల ఉపాధ్యాయులు రూపొందించిన చిత్రానికి రాష్ట్రస్థాయిలో అగ్రస్థానం లభించింది. దీనికి సంబంధించి సమగ్ర శిక్ష అభియాన్‌ రాష్ట్ర పోర్టల్‌లో ముఖచిత్రంగా ఏర్పాటు చేశారు. దీంతోపాటు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ పాఠశాల ఫొటో చిత్రాన్ని తన స్టేటస్‌తోపాటు సామాజిక మాధ్యమాల్లో ట్యాగ్‌ చేస్తూ పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పాఠశాలకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించడం పట్ల జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్ర శిక్ష అభియాన్‌ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాది నాగరాజుతోపాటు ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలిపారు.

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : జిల్లా స్థాయి బ్యాడ్మింటన్‌ ఎంపికల్లో కడప జిల్లాకు చెందిన పూర్వజ రెడ్డి అండర్‌–15, 17 విభాగాలలో సింగిల్స్‌ విజేతగా నిలిచి సత్తాను చాటినట్లు జిల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ సభ్యులు జిలానీబాషా తెలిపారు. ఆదివారం నగరంలోని డీఎస్సీ ఇండోర్‌ స్టేడియంలో జిల్లా స్థాయి సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అండర్‌–15 బాలుర విభాగంలో ప్రొద్దుటూరుకు చెందిన క్రీడాకారులు రాణించి మొత్తం జిల్లా జట్టులోని స్థానాలను కై వసం చేసుకున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 15 మంది క్రీడాకారులు ఇందులో పాల్గొన్నారన్నారు. అండర్‌–15, 17 విభాగాలలో జరిగిన ఈ ఎంపికలో బాలబాలికలకు విడివిడిగా సింగిల్స్‌, డబుల్స్‌లో పోటీలను నిర్వహించి జిల్లా జట్టును ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులకు జిల్లా అసోసియేషన్‌ సభ్యులు గంగాధర్‌, నాగరాజు డాక్టర్‌ ప్రతాప్‌ రెడ్డి, విశ్వనాథరెడ్డి జ్ఞాపికలను అందజేశారు.

పోటీలకు ఎంపికై న క్రీడాకారులు వీరే..

అండర్‌ 15 బాలురు జట్టు – డి.ఈశ్వర్‌ ప్రసాద్‌రెడ్డి, చంద్రకిషోర్‌, ిపీబీజీ వర్షిత్‌ (ప్రొద్దుటూరు). అండర్‌ 15 బాలికల జట్టు – ఎల్‌.పూర్వజరెడ్డి, బి.హరిణి, రితిక, కావ్య (కడప). అండర్‌ 17 బాలుర జట్టు – వేద వ్యాస్‌ వర్మ, ఎల్‌ సుప్రీత్‌రెడ్డి (కడప) సి.విశ్వతేజ (ప్రొద్దుటూరు). అండర్‌ 17 బాలికల జట్టు–రమ్యశ్రీ (ప్రొద్దుటూరు) ఎల్‌.పూర్వజ, కావ్య, రితిక (కడప).

రైలులో నుంచి పడి  వృద్ధుడికి గాయాలు1
1/1

రైలులో నుంచి పడి వృద్ధుడికి గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement