
అశ్వవాహనంపై చెన్నకేశవస్వామి
రాజంపేట : తాళ్లపాక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం అశ్వవాహనంపై శ్రీ చెన్నకేశవస్వామి దర్శనిమిచ్చారు. అలాగే శ్రీ సిద్దేశ్వరస్వామికి పల్లకీసేవ నిర్వహించారు. గ్రామ వీధుల్లో భక్తులు స్వామివార్లకు కాయకర్పూరం సమర్పించుకున్నారు. పార్వేటి ఉత్సవం ఘనంగా నిర్వహించారు.
నేడు ధ్వజావరోహణం
శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్దేశ్వరస్వామికి బ్రహ్మోత్సవాలకు సోమవారం ధ్వజావరోహణం కార్యక్రమం నిర్వహించనున్నారు. సిద్దేశ్వరునికి త్రిశూలస్నానం, శ్రీ చెన్నకేశవస్వామికి చక్రస్నాన కార్యక్రమం నిర్వహించనున్నారు.
అపరకాశి.. తాళ్లపాక
అపరకాశి తాళ్లపాక అని హిందూ ధర్మప్రచార పరిషత్ ధర్మాచార్యులు గంగనపల్లె వెంకటరమణ అన్నారు. తాళ్లపాక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం తాళ్లపాక స్థలపురాణం, అన్నమాచార్యుల జీవితం అనే అంశంపై ఆధ్యాత్మిక ఉపన్యాసం చేశారు. జిల్లా ప్రోగ్రాం గోపిబాబు పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో ధార్మిక ఉపన్యాసకులు కందిమల్లు రాజారెడ్డి అన్నమయ్య జీవిచరిత్ర విశేషాలపై ప్రసంగించారు.