
అదృశ్యమైన విద్యార్థి ఆచూకీ లభ్యం
పీలేరురూరల్ : పీలేరు పట్టణం బండ్లవంకలో నివాసం ఉంటున్న రాజశేఖర్, సునీత కుమార్తె జోష్ణవి (13) ఈ నెల 6వ తేదీ అదృశ్యమైన సంఘటన విదితమే. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం జోష్ణవి తిరుమలలో ఉన్నట్లు గుర్తించిన అక్కడి పోలీసుల నుంచి సమాచారం అందింది. పీలేరు సీఐ యుగంధర్, ఎస్‌ఐ లోకేష్ ఆధ్వర్యంలో పోలీసులు తిరుమలకు వెళ్లి జోష్ణవిని తీసుకొచ్చి శనివారం తల్లిదండ్రులకు అప్పగించారు. అదృశ్యమైన జోష్ణవి సురక్షితంగా తిరిగిరావడంతో తల్లిదండ్రులు, బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
వైఎస్సార్‌సీపీ
నాయకుడిపై దాడి
లక్కిరెడ్డిపల్లి : మండలంలోని పందిళ్లపల్లి గ్రామం, దిన్నెపల్లికి చెందిన మాజీ ఫీల్డ్ అసిస్టెంట్, వైఎస్సార్‌సీపీ నాయకుడు లక్ష్మిరెడ్డిపై దాడి జరిగింది. తన పొలంలో ఉన్న బావి లో శనివారం సాయంత్రం మోటారును అమర్చుకుంటుండగా అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గంగిరెడ్డి తన అనుచరులతో కలిసి ఇనుపరాడ్లతో దాడి చేసి గాయపరిచారు. గాయపడిన లక్ష్మిరెడ్డిని బంధువులు లక్కిరెడ్డిపల్లి ప్రభు త్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు లక్కిరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
బాలిక అదృశ్యం
రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు పట్టణంలోని చందనా థియేటర్ వద్ద నివాసం ఉంటున్న రజియా కుమార్తె రేష్మా (12) శనివారం అదృశ్యమైనట్లు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హెచ్‌ఎంఎం హైస్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న రేష్మా గత మూడు రోజుల నుంచి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు చుట్టు పక్కల బంధువులు, తెలిసిన వారిని విచారించారు. ఫలితం లేకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడి ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : తల్లి మందలించిందని, మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శనివారం మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని బుగ్గకాలువకు చెందిన అంజిమోహన, భారతి దంపతుల కుమారుడు తేజ్‌కుమార్(27) స్థానికంగా పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. కుటుంబ సమస్యల కారణంగా తల్లి మందలించడంతో మనస్తాపం చెంది ఇంటివద్దే పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి తరలించారు.

అదృశ్యమైన విద్యార్థి ఆచూకీ లభ్యం

అదృశ్యమైన విద్యార్థి ఆచూకీ లభ్యం