
భరత నాట్యంలో కలికిరి వాసికి బంగారు పతకం
కలికిరి : తమిళనాడు రాష్ట్రం సేలంలో ఎస్‌ఏఎస్ ఈవెంట్స్, కై లాస మానస సరోవర స్కూల్ ఆధ్వర్యంలో నటరాజ నర్తనం ప్రపంచ భరతనాట్య పోటీలు శనివారం నిర్వహించారు. ఈ పోటీలకు వివిధ దేశాలతో పాటు, జాతీయ స్థాయిలో పలు రాష్ట్రాల నుంచి 3వేల మంది ప్రదర్శకులు హాజరై 30 నిమిషాల పాటు ఒకే సారి ఏకధాటిగా నృత్య ప్రదర్శన చేసి, నటరాజ స్వామికి నాట్య నీరాజనాన్ని సమర్పించారు. దీంతో ఈవెంట్ ప్రపంచ రికార్డులకెక్కింది. కార్యక్రమానికి జిల్లా నుంచి కలికిరి పట్టణానికి చెందిన షేక్ రియాజుల్లా(పండు) హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తమిళ నటి ప్రియదర్శిని ఈయన నృత్య ప్రదర్శనకు గాను ఇంటర్నేషనల్ టైమ్స్ వరల్డ్ రికార్డ్ గుర్తింపు పత్రంతో పాటు, బంగారు పతకాన్ని అందజేసి అభినందించారు.