
డెంగీ నివారణకు కృషి చేద్దాం
రాయచోటి టౌన్ : డెంగీ నివారణకు కృషి చేద్దామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎల్. లక్ష్మీనరసయ్య పిలుపునిచ్చారు. సోమవా రం రాయచోటి జిల్లా వైద్యా ఆరోగ్యశాఖ కార్యాలయంలో జాతీయ డెంగీ వారోత్సవ పోస్టర్లు ఆవిష్కరించారు.అనంతరంమాట్లాడుతూ ఈడి స్ విజిప్టి దోమ కాటుతో డెంగీ వస్తుందన్నారు. దోమల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎంపీహెచ్ ఈఓవై శ్రీనివాసుల రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ట్రిపుల్ ఐటీలో ప్రారంభమైన అడ్మిషన్ల ప్రక్రియ
వేంపల్లె : వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీలో సోమవారం విద్యార్థులకు అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించారు. డైరెక్టర్ ఏవీఎస్ కుమారస్వామి గుప్తా, పరిపాలన అధికారి రవికుమార్, డీన్ అకడమిక్ రమేష్ కై లాస్ ప్రారంభించారు. అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం పెద్దవీడు గ్రామానికి చెందిన బి.మేఘన తొలి అడ్మిషన్ పొందగా.. సత్యసాయి జిల్లా బుక్కపట్నం గ్రామానికి చెందిన బి.హరీష్ రెండవ అడ్మిషన్, కర్నూలు జిల్లా దేవనకొండ మండలం అలారుదిన్నె గ్రామానికి చెందిన బి.మహేశ్వరి మూడవ అడ్మిషన్ పొందారు. డైరెక్టర్ కుమారస్వామి గుప్తా ఎంపికై న మొదటి, మూడు ర్యాంకుల విద్యార్థులకు ప్రవేశ పత్రాలతోపాటు బహుమతులను ప్రదానం చేశారు. తొలి రోజు 538 మందికి అడ్మిషన్లు పిలవగా, 481 మంది హాజరై అడ్మిషన్లను పొందారు.
వెఎస్సార్‌ను స్మరించుకున్న విద్యార్థులు
రాష్ట్ర నలుమూలల నుంచి అడ్మిషన్లు పొందేందుకు విద్యార్థులు వచ్చారు. ఈ నేపథ్యంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని వారు స్మరించుకున్నారు. ఆయన ఈ ట్రిపుల్‌ఐటీలను స్థాపించడం వల్లే తమ లాంటి పేద విద్యార్థులకు ఇలాంటి అవకాశం వచ్చిందన్నారు. ఆయనను ఎన్నటికీ మరువలేమన్నారు.