
హోరాహోరీగా ఫుట్‌బాల్ చాంపియన్ షిప్ పోటీలు
మదనపల్లె సిటీ : రాష్ట్ర స్థాయి బాలుర జూనియర్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు హోరా హోరీగా జరుగుతున్నాయి. మదనపల్లె సమీపంలోని వేదా పాఠశాలలో సోమవారం వివిధ జిల్లాల జట్ల మధ్య పోటీలు నిర్వహించారు. సెమీ ఫైనల్స్‌లో సత్యసాయి–అనంతపురం జిల్లా జట్లు పోటీపడగా 2–0 స్కోరుతో సత్యసాయి జిల్లా జట్టు విజయం సాధించింది. మరో సెమీ ఫైనల్స్‌లో తిరుపతి–విశాఖపట్నం జట్లు పోటీ పడగా 7–4 స్కోరుతో తిరుపతి జట్టు గెలుపొందింది. ఫైనల్స్‌కు సత్యసాయి, తిరుపతి జట్లు చేరాయి. మంగళవారం తిరుపతి–సత్యసాయి జట్ల మధ్య పోటీ జరగనుంది. పోటీలను ఫుట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దిలీప్‌కుమార్, మురళీధర్, మహేంద్ర, సిరాజ్, ఇర్షాద్, బాలాజీ, పవన్, చినబాబు పర్యవేక్షించారు.