
జూనియర్ బాలుర ఫుట్‌బాల్ విజేత సత్యసాయి జిల్లా
మదనపల్లె సిటీ : మదనపల్లె సమీపంలోని వేద పాఠశాలలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి జూనియర్ బాలుర ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో ఫైనల్స్‌లో సత్యసాయి జిల్లా విజేతగా నిలిచింది. గత మూడు రోజుల నుంచి పలు జిల్లాల జట్ల మధ్య పోటీలు జరుగుతున్నాయి. ఫైనల్స్‌లో సత్యసాయి, తిరుపతి జట్లు పోటీపడగా సత్యసాయి జిల్లా విజయం సాధించి విజేతగా నిలిచింది. రన్నర్స్‌గా తిరుపతి జట్టు, తృతీయ స్థానంలో అనంతపురం జట్టు నిలిచాయి. ఈ టోర్నమెంటులో బెస్ట్ ప్లేయర్స్‌ను ఎంపిక చేసి వారిని ఈనెల మూడవ వారంలో అమృతసర్‌లో జరిగే జాతీయ స్థాయి టోర్నమెంటుకు పంపనున్నట్లు ఫుట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దిలీప్‌కుమార్, మురళీధర్ తెలిపారు. విజేతలకు వేదా పాఠశాల కరస్పాండెంట్ రామలింగారెడ్డి, పోతబోలు సర్పంచు ఈశ్వరయ్యలు ట్రోఫీ, మెడల్స్ అందజేశారు. కార్యక్రమంలో కోచ్‌లు సిరాజ్, చినబాబు, శ్రీనివాస్, మహీంద్ర, కమలేష్, బాలాజీ, నరేంద్ర పాల్గొన్నారు.