
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
సంబేపల్లె : చిత్తూరు– కర్నూలు జాతీయ రహదారిపై మోటకట్ల శివాలయం సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. పోలీసుల వివరాల మేరకు.. మండల పరిధిలోని వంగమళ్లవాండ్లపల్లెకు చెందిన క్రిష్ణారెడ్డి, భార్య నాగులమ్మలు స్కూటీలో మోటకట్ల సమీంలోని కుండల షాపు వద్దకు వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. మోటకట్ల శివాలయం సమీపంలోకి రాగానే సంబేపల్లె వైపు నుంచి బైకుపై వస్తున్న భాస్కర్‌రెడ్డి అదుపు తప్పి భార్యాభర్తలు వెళుతున్న స్కూటీని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో భార్యాభర్తలతో పాటు భాస్కర్‌రెడ్డికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 సహాయంతో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
హైకోర్టు ఉత్తర్వులు బేఖాతరు
కలికిరి(వాల్మీకిపురం) : రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే... కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన కొన్ని రోజుల్లోనే రాజకీయ ఒత్తిళ్లతో అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తి గ్రామానికి చెందిన సంఘమిత్రలు నల్లంకి సుమలత(వి.ఒ.–6), నల్లంకి రేఖ(వి.ఒ–1) లను డీఆర్‌డీఎ అధికారులు ఎలాంటి ముందస్తు నోటీసులుగానీ, సమాచారం ఇవ్వకుండా విధులనుంచి తొలగించారు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. వీరి వినతిని పరిశీలించిన హైకోర్టు తొలగించిన సంఘమిత్రలను విధుల్లోకి తీసుకోవాలని డీఆర్‌డీఏ అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయినా డీఆర్‌డీఏ అధికారులు హైకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ తొలగించిన సంఘ మిత్రలను విధుల్లోకి తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారు. తమకు న్యాయం జరగక పోవడంతో బాధిత సంఘమిత్రలు తిరిగి కోర్టు ధిక్కారంపై హైకోర్టును ఆశ్రయించి న్యాయం చేయాలని విన్నవించుకున్నారు.
లైసెన్స్ ఉన్న షాపుల వద్దే మద్యం కొనుగోలు చేయాలి
రాయచోటి టౌన్ : లైసెన్స్ పొందిన రిటైల్ మద్యం షాపు వద్ద మాత్రమే మద్యం కొనుగోలు చేయాలని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ రాయచోటి సీఐ గురుప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. వివాహాలు, పార్టీలు, ఇతర వేడుకలకు తాము మద్యం తగ్గింపు ధరలకే సరఫరా చేస్తామని మోసం చేసే వారున్నారన్నారు. అలాంటి వారు నకిలీ మద్యం విక్రయిస్తారన్నారు. అలాంటి మద్యం సేవించడం వలన ఆరోగ్యాలు పాడవడంతో పాటు కొన్ని సందర్భాలలో ప్రాణాలు కూడా కోల్పోతారని చెప్పారు. అలాంటి అనుమానిత వ్యక్తుల వివరాలను టోల్ ఫ్రీ నంబర్ 14405కు కానీ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి నంబర్ 7981216391 కు ఫోన్ తెలియజేయాలని కోరారు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు