
కాపాడుకోవడం కష్టంగా ఉంది
ఇప్పుడు టమాటా పంటను కాపాడుకోవడం చాలా కష్టంతోపాటు ఖర్చుతో కూడుకొంది. ధరలు పెరుగుతున్నా వైరస్‌లు, తెగుళ్లు.. వాతావారణంలో వస్తున్న మార్పుల కారణంగా దిగుబడి తగ్గిపోతోంది. ఉన్న పంటనైనా కాపాడుకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. – రెడ్డిమోహన్, రైతు, చెరువుమొరవపల్లె, గుర్రంకొండ
సబ్సిడీపై మందులు ఇవ్వాలి
ఊజి వైరస్ నివారణకు సరైన మందులు లేకపోవడంతో.. వేగంగా విస్తరిస్తోంది. పంట భారీగా దెబ్బతిని వినియోగానికి ఉపయోగపడటం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన పురుగు నివారణ మందులను సబ్సిడీపై సరఫరా చేయాలి. నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. – ఎండపల్లి బాలకృష్ణారెడ్డి,
రైతు సంఘ నాయకుడు, రాయచోటి
సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
టమాటాలకు మార్కెట్‌లో అనుకూల ధరలు లేకపోవడంతో.. రైతులు సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టలేకపోతున్నారు. ఏప్రిల్, మేలలో పంటకు సరైన ధర లేకపోవడంతో కోతలు కోయకుండా వదిలేశారు. అలాంటి తోటలలో ఊజి వైరస్ ఎక్కువ ఉంటుంది. దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాలి. తెగులు సోకిన మొక్కలు తొలగించి, పురుగు నివారణ మందులు వాడటం వల్ల అరికట్టవచ్చు.
– ఎస్.సుభాషిణి, జిల్లా ఉద్యానవన అధికారిణి

కాపాడుకోవడం కష్టంగా ఉంది

కాపాడుకోవడం కష్టంగా ఉంది