
వీరభద్రస్వామి హుండీ ఆదాయం లెక్కింపు
రాయచోటి టౌన్ : రాయచోటిలోని శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో హుండీల ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. ప్రధాన ఆలయాలతోపాటు ఉప ఆలయాలకు భక్తులు 95 రోజుల పాటు సమర్పించిన నగదు, కానుకలను లెక్కించారు. హుండీల ద్వారా రూ.19,55,945, నిత్యాన్నదానానికి రూ.1,12,888 వచ్చింది. అలాగే హుండీలలో బంగారం 53.600 గ్రాములు, వెండి 1.800 కిలోలు వచ్చినట్లు ఈవో డీవీ రమణారెడ్డి తెలిపారు. ఈ మొత్తాన్ని రాయచోటి పట్టణంలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌లో జమ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లా దేవదాయశాఖ అధికారి సి. విశ్వనాథ్ పర్యవేక్షణలో లెక్కింపు చేపట్టారు.
ఇద్దరు ఫీల్డ్‌అసిస్టెంట్‌ల సస్పెన్షన్
మదనపల్లె రూరల్ : ఉపాధి హామీ పథకం పనుల్లో అవకతవకలకు పాల్పడిన ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్‌లను సస్పెండ్ చేశారు. పట్టణంలోని వెలుగు మండల మహిళా సమాఖ్య కార్యాలయ ఆవరణలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనులపై 19వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి డ్వామా పీడీ వెంకటరత్నం ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించారు. సామాజిక తనిఖీ ప్రజావేదికలో హౌసింగ్‌కు సంబంధించి బిల్లులను లబ్ధిదారులకు కాకుండా ఇతరులకు ఇచ్చినట్లు విచారణలో తేలడంతో.. కోళ్లబైలు వైఎస్‌ఆర్ కాలనీకి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ రెడ్డిశేఖర్, కొత్తవారిపల్లె ఫీల్డ్‌అసిస్టెంట్ కిరణ్‌కుమార్‌ను సస్పెండ్ చేశారు. అలాగే ఉపాధి వేతనాల చెల్లింపులు, మస్టర్ల హాజరు లెక్కింపులో తప్పిదాలు, పని ప్రదేశం తేడాలు వంటి తప్పిదాలపై మండలంలోని 25 పంచాయతీల్లో రూ.54 వేల రికవరీకి ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. రూ.18,500 వేల జరిమానా విధించారు. 61 పనులకు సంబంధించి ఏపీడీ ఆధ్వర్యంలో రీ ఎంక్వయిరీకి ఆదేశించారు.
ఆర్థిక సమ్మిళితత్వంపై
విస్తృత ప్రచారం
రాయచోటి : జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఆర్థిక సమ్మిళితత్వం కోసం విస్తృత ప్రచారం చేయాలని జిల్లాలోని అన్ని బ్యాంకుల అధికారులను జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ తన చాంబర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థికశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఆర్థిక సమ్మిళితత్వంపై గోడపత్రికను ఆవిష్కరించారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆధ్వర్యంలో జరగబోయే ప్రచార కార్యక్రమాలను ప్రతి గ్రామ పంచాయతీలో ప్రత్యేక క్యాంపుల ద్వారా నిర్వహించాలని తెలిపారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష యోజన, అటల్ పెన్షన్ యోజన తదితర పథకాలను ప్రజలందరికీ తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేజర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
జలాశయాల్లో
చేపల వేట నిషేధం
కొండాపురం : జిల్లాలోని గండికోట జలాశయం, బ్రహ్మసాగర్, సోమశిల వెనుక జలాలలో చేపల వేట నిషేధించినట్లు ఉప మత్య్ససంచాలకులు నాగయ్య మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహజంగా చేపల సంతానోత్పత్తి జూలై 1 నుంచి ఆగస్టు31 వ తేది వరకు ఉంటుందని.. ఈ 62 రోజులపాటు మత్య్సకారులు ఎవరు చేపలు పట్టకూడదని ఆయన హెచ్చరించారు. చేపల వేటకు పోతే ప్రభుత్వ నియమ నిబంధనలను అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జలాశయాలల్లో వేటకు వెళ్లితే మత్స్యకారుల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.

వీరభద్రస్వామి హుండీ ఆదాయం లెక్కింపు

వీరభద్రస్వామి హుండీ ఆదాయం లెక్కింపు