
రెండు కార్లు ఢీ
సంబేపల్లె : చిత్తూరు– కర్నూలు జాతీయ రహదారిపై మండల పరిధిలోని మొటుకువాండ్లపల్లె క్రాస్ సమీపంలో రెండు కార్లు ఢీ కొన్న ప్రమాదంలో 8 మందికి గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. అనంతపురం జిల్లా గుత్తి ఆర్‌ఎస్ నగర్‌కు చెందిన చరణ్‌తేజ్ అమ్మ లక్ష్మీదేవి, మామలు తిమ్మరాజు, గుర్రప్పలతో కలిసి అన్నమయ్యజిల్లా కేవీపల్లె మండల గ్యారంపల్లె సమీపంలోని గురుకుల పాళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశం కోసం సర్టిఫికెట్ పరిశీలనలో భాగంగా కళాశాలకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన వెంకటశివారెడ్డి, అమ్మ జయమ్మ, భార్య వెంకటేశ్వరమ్మ, కొడుకు ఉమాకాంత్‌రెడ్డి, కూతురు శిరీషా, మామ రామిరెడ్డి, అత్త లక్ష్మీదేవమ్మలు కారులో అరుణాచలం శివున్ని దర్శించుకుని తిరిగి స్వగ్రామానికి వస్తుండగా అదుపు తప్పి రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వెంకటశివారెడ్డి, గుర్రప్ప మినహా అందరికీ గాయాలయ్యాయి. వెంటనే వారిని రాయచోటి ప్రభ్వుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు. సంఘటన స్థలాన్ని సంబేపల్లె పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.
వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి
బద్వేలు అర్బన్ : బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని తొట్టిగారిపల్లె పీహెచ్‌సీ వైద్యుల నిర్లక్ష్యంతో తన భార్య ప్రాణాలు కోల్పోయినట్లు బద్వేలు మండలం గుండంరాజుపల్లి ఎస్టీ కాలనీకి చెందిన శ్రీనివాసులు ఆరోపించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు తన భార్య అయిన పామూరి పెంచలమ్మ మూడవ కాన్పులో ఆదివారం తెల్లవారుజామున ఇంటి దగ్గరే బిడ్డకు జన్మనిచ్చింది. అయితే అధికంగా రక్తస్రావం అవుతుండడంతో తొట్టిగారిపల్లె పీహెచ్‌సీ ఏఎన్‌ఎంను సంప్రదించగా ఆసుపత్రి వద్దకు తీసుకువెళ్లాలని సూచించడంతో ఆటోలో పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ డ్యూటీలో ఉన్న నర్సు డాక్టర్‌కు ఫోన్ చేసి డాక్టర్ సూచనలతో ట్రీట్మెంట్ ఇచ్చినట్లు బాధితులు చెబుతున్నారు. రక్తస్రావం ఆగకపోవడంతో వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో పట్టణంలోని మరొక ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది.
8 మందికి గాయాలు

రెండు కార్లు ఢీ

రెండు కార్లు ఢీ

రెండు కార్లు ఢీ