
గంగమ్మ ఆలయంలో భక్తుల రద్దీ
లక్కిరెడ్డిపల్లి: కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్న లక్కిరెడ్డిపల్లెలోని అనంతపురం గంగమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారి దర్శనం కోసం గంటల కొద్దీ క్యూలైన్‌లలో వేచి ఉన్నారు. గంగమ్మా ..కరుణించమ్మా.. సకాలంలో వర్షాలు కరుపించు తల్లీ అంటూ భక్తులు అంటూ వేడుకున్నారు. జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కొందరు బోనాలు సమర్పించారు. మరికొందరు తలనీలాలు అర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పూజారులు చెల్లు వంశీయులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
ప్రత్యేక అలంకరణలో అమ్మవారు