
డ్రాగా ముగిసిన కడప–కర్నూలు మ్యాచ్
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్‌లో భాగంగా శనివారం మూడో రోజు కడప –కర్నూలు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. 14 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మ్యాచ్ ప్రారంభించిన కర్నూలు జట్టు 97 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 331 పరుగులు చేసింది. ఆ జట్టులోని విష్ణు వర్దన్ నాయుడు 134 బంతుల్లో 100 పరుగుల సెంచరీ చేసి నాటౌట్‌గా నిలిచాడు. సాయి గణేష్ 72 పరుగులు చేశాడు. కడప జట్టులోని శివశంకర్ 3 వికెట్లు, ఆర్దిత్‌రెడ్డి 2 వికెట్లు తీశారు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో 765 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
కేఓఆర్‌ఎం క్రికెట్ మైదానంలో..
కేఓఆర్‌ఎం క్రికెట్ మైదానంలో జరిగిన నెల్లూరు–అనంతపురం మ్యాచ్‌లో ఆనంతపురం జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శనివారం మూడో రోజు 173 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మ్యాచ్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 99.2 ఓవర్లలో 405 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని కారుణ్య ప్రసాద్ 211 బంతుల్లో 135 పరుగులు, షాహుల్ హమీద్ 89 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని టీవీ సాయి ప్రతాప్ రెడ్డి 3 వికెట్లు, కేహెచ్ వీరారెడ్డి 3 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 24.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసి విజయం సాధించింది. ఆ జట్టులోని కేహెచ్ వీరారెడ్డి 37 పరుగులు చేశాడు. నెల్లూరు జట్టులోని షాహుల్ హమీద్ 2 వికెట్లు తీశాడు.
కేఓఆర్‌ఎం క్రికెట్ మైదానంలో 6 వికెట్ల తేడాతో అనంతపురం జట్టు విజయం

డ్రాగా ముగిసిన కడప–కర్నూలు మ్యాచ్

డ్రాగా ముగిసిన కడప–కర్నూలు మ్యాచ్

డ్రాగా ముగిసిన కడప–కర్నూలు మ్యాచ్