
పంజం సుకుమార్ రెడ్డి మృతి తీరనిలోటు
రైల్వేకోడూరు అర్బన్: రైల్వేకోడూరు నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు, వ్యవసాయ సలహా మండలి మాజీ చైర్మన్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజం సుకుమార్‌రెడ్డి (64) ఆకస్మిక మృతి పార్టీకి తీరని లోటని వైఎస్సార్‌సీపీ నాయకులు అన్నారు. అనారోగ్యంతో చైన్నెలో శుక్రవారం పంజం సుకుమార్‌రెడ్డి మృతిచెందిన నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి.. మాజీ ఎమ్మెల్యే కొండూరు ప్రభావతమ్మ, మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి తదితరులు అనంతరాజుపేటలో పంజం మృతదేహాన్ని సందర్శించారు నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. 40 ఏళ్లుగా క్రియాశీలక రాజకీయాల్లో చురుగ్గా ఉన్న పంజం సుకుమార్ రెడ్డి గత ప్రభుత్వంలో జిల్లా వ్యవసాయ సలహామండలి చైర్మన్‌గా, డీఆర్‌యూసీసీ సభ్యుడిగా, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, అనంతరాజుపేట సర్పంచ్‌గా, ప్రైవేట్‌స్కూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా పలు పదవులు చేపట్టారు. తనదైన శైలిలో వాటికి వన్నె తెచ్చారు. వైఎస్సార్ కుటుంబం వెంట నడుస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేశారు.
ప్రముఖుల నివాళి
పంజం సుకుమార్‌రెడ్డి మృతి విషయం తెలుసుకున్న టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ సీనియర్ రాష్ట్ర నాయకులు భూమన కరుణాకర్‌రెడ్డి, ‘సాక్షి’ ఎడిటర్ రక్కసి ధనుంజయరెడ్డి, మాజీఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, భూమన అభినయ్‌రెడ్డి, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొండూరు అజయ్‌రెడ్డి, వత్తలూరు సాయికిశోర్‌రెడ్డి, చెవ్వు శ్రీనివాసులురెడ్డి తదితర నాయకులు పంజం స్వగ్రామానికి చేరుకున్నారు. సుకుమార్‌రెడ్డి మృతదేహానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పుల్లంపేట ఎంపీపీ ముద్దా బాబుల్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ ముస్తాక్, సీనియర్ నాయకులు కుమార్ రెడ్డి, రామనాథంలు పంజం సుకుమార్‌రెడ్డి భౌతికకాయం వద్ద నివాళులర్పించారు.
నేడు అంత్యక్రియలు: వైఎస్సార్సీపీ నాయకులు పంజంసుకుమార్‌రెడ్డి భౌతికకాయానికి శనివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం ఉదయం అనంతరాజుపేటకు రానున్నారు. పంజం మృతదేహానికి నివాళులు అర్పించనున్నారు.

పంజం సుకుమార్ రెడ్డి మృతి తీరనిలోటు