
‘వందేభారత్’ ట్రయల్ రన్ విజయవంతం
కడప కోటిరెడ్డిసర్కిల్: దేశంలో అధిక వేగంతో నడుస్తున్న రైళ్లలో ఒకటైన వందే భారత్ రైలు గురువారం కడప– రేణిగుంట మార్గంలో ట్రయల్ రన్ నిర్వహించారు. కాచిగూడ–చైన్నె మార్గంలో వందేభారత్ రైలు నడిపేందుకు ఈ ట్రయల్ రన్ నిర్వహించినట్లు సమాచారం. కాగా 130 కి.మీ. స్పీడ్‌తో రైలు నడిచినా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదని రైల్వే అధికారులు గుర్తించారు. ట్రయల్ రన్ విజయవంతం కావడంతో త్వరలోనే ఈ మార్గంలో వందేభారత్ రైలు నడిచే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
220 మంది హాజరు
కడప ఎడ్యుకేషన్: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం కడప నగర శివార్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం జరిగిన కౌన్సెలింగ్‌కు 86001వ ర్యాంకు నుంచి 104000 వేల ర్యాంకులకు సంబంధించిన అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 220 మంది అభ్యర్థులు తమ కౌన్సెలింగ్‌ను పూర్తి చేసుకుని ధృవ పత్రాలను పరిశీలించుకున్నారు. ఈ కార్యక్రమంలో కో ఆర్డినేటర్ సీహెచ్ జ్యోతి, చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ ఎస్‌ఆర్ లక్ష్మి ప్రసాద్, వెరిఫికేషన్ ఆఫీసర్లు వసుంధర, మల్లేశ్వరమ్మ, లావణ్య, రాజేష్ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
నేటి కౌన్సెలింగ్‌కు...
నేడు నిర్వహించబోయే కౌన్సిలింగ్‌కి జిల్లావ్యాప్తంగా 104001 నుంచి 120000 వేల ర్యాంకులు వచ్చిన అభ్యర్థులు రావాలని కో ఆర్డినేటర్ సీహెచ్ జ్యోతి తెలిపారు.
జీవాలకు నట్టల నివారణ మందు వేయించాలి
సుండుపల్లె: గొర్రెలు, మేకల పెంపకం దారులు తమ జీవాలకు నట్టల నివారణ మందును తప్పకుండా వేయించాలని జిల్లా పశుసంవర్ధకశాఖ సంయుక్త సంచాలకుడు డాక్టర్ గుణశేఖర్‌పిళ్లై పేర్కొన్నారు. గురువారం సుండుపల్లె మండల కేంద్రానికి సమీపంలోని ఈడిగపల్లెలో గొర్రెలకు ఉచితంగా నట్టల నివారణ మందులను వేసినట్లు ఆయన తెలిపారు. జులై 10వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని మేకలు, గొర్రెల కాపర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో మూగజీవాలకు పలు రకాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. పశువైద్యాధికారులు సూచ నలు పాటించి నివారణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో సహాయ సంచాలకులు డాక్టర్ విజయ్‌కుమార్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ మాలకొండయ్య, డాక్టర్ శ్రీధర్‌రెడ్డి, సంబేపల్లి పశువైద్యాధికారి లోకేష్, ఏడీ వెంకటేశ్వరరెడ్డి, గోపాలమిత్ర సిబ్బంది పాల్గొన్నారు.