
5 నుంచి సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు
రాజంపేట: నందలూరు సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు వచ్చేనెల 5 నుంచి 13వ తేదీ వరకు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని టీటీడీ చైర్మన్ బీఆర్‌నాయుడు అధికారులను ఆదేశించారు. తిరుమల టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరితో కలిసి గురువారం తాళ్లపాక, సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవోలునటేష్‌బాబు, ప్రశాంతి పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవ వివరాలు: జూలై 05 ఉదయం 10.30 నుంచి 11గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైవుతాయి. ప్రతి రోజు ఉదయం 8గంటలకు , రాత్రి 7గంటలకు వాహనసేవలు జరుగనున్నాయి. 6న హంసవాహనం, 7న సింహవాహనం,8న హనుమంతవాహనం, 9న గరుడవాహనం, 10న సూర్యప్రభ, చంద్రప్రభవాహనం ,11న కల్యాణోత్సవం, 12 రథోత్సవం, 13న చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం ఉంటాయి. 11న జరిగే కల్యా ణోత్సవంలో గృహస్తులు (ఇద్దరు)రూ.500 చెల్లించి పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేయనున్నారు. జూలై 14న సాయంత్రం పుష్పయాగం జరుగుతంది.. టీటీడీ హిందూ ధర్మప్రచారపరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు , దాస సాహిత్య ప్రాజెక్టుల ద్వారా ప్రతి రోజు ఆధ్యాత్మిక , భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కాగా తాళ్లపాకలో జూలై 05 నుంచి 15వతేది వరకు శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్దేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.