
శాఖల సమన్వయంతోనే ఆదాయం పెంపు
రాయచోటి: అన్ని శాఖల సమన్వయంతోనే వార్షిక ఆదాయం పెంపు సాధ్యమని, పన్నుల పరిధిలోని అన్నింటినీ తీసుకురావడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్సు హాల్‌లో జీఎస్టీ ఆదాయంపై వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. అన్నమయ్య జిల్లా ఇన్‌చార్జ్ జీఎస్టీ అధికారి, జిల్లా పంచాయతీశాఖ మున్సి పాల్టీలు, మున్సిపల్ కార్పోరేషన్లు, ఆడిట్ శాఖ తదితర శాఖల జీఎస్టీ ఆదాయాన్ని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమయ్యే ఆదాయాన్ని పన్నులు ద్వారా సమీకరిస్తుందని కలెక్టర్ అన్నారు. రాష్ట్ర జీఎస్టీ ఆదాయాన్ని పెంచడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, మదనపల్లి, రాజంపేట సబ్ కలెక్టర్లు మేఘస్వరూప్, వైఖోమ్ నదియా దేవి, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా జీఎస్టీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజాస్వామ్య విలువలను కాపాడిన యోధులను స్మరించుకునేందుకే..
ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడిన యోధులను స్మరించుకునేందుకే రాజ్యాంగ హత్య దినం జరుపుకుంటున్నామని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. బుధవారం రాయచోటి కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రాజ్యాంగ హత్య దినంను నిర్వహించారు. డీఆర్‌ఓ మధుసూదనరావు, అదనపు ఎస్పీ వెంకటాద్రి మాట్లాడారు.
● జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్