
ఊసే లేని ఫీజు రీయింబర్స్‌మెంట్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయలేదు.విద్యాదీవెన,వసతి దీవెన నిధుల కోసం విద్యార్థులు ఏడాదిగా ఎదురు చూస్తున్నారు.గత వైఎస్సార్ సీపీ పాలనలో త్రైమాసికం ముగిసిన వెంటనే పూర్తి ఫీజు రీఎంబర్స్ మెంట్ మంజూరు చేసేవారు.కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. విద్యార్థులు అప్పులు చేసుకుని చదువుకుంటున్నారు. – జంగంరెడ్డి కిషోర్ దాస్,
జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు
యువతను మోసం చేసిన
ఘనత చంద్రబాబుదే
నిరుద్యోగులకు 20లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఉద్యోగాలు ఇవ్వ లేదు సరికదా ఉన్న ఉద్యో గాలు ఊడపీకుతూ నిరుద్యోగులను నిలువునా ముంచారు. అధికారంలోకి వస్తే నెలకు రూ.3,000 నిరుద్యోగ భతి ఇస్తామని నమ్మిం చి ఇవ్వకుండా ఎగనామం పెట్టారు. ఈ కూటమి ప్రభుత్వం గత ఏడాది కా లంగా విద్యార్థులను, యువతను మోసం చేస్తున్న వైనాన్ని నిలదీస్తున్నాం. తక్షణమే కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేయాలి. – శివప్రసాద్ రెడ్డి,
జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు
నిరుద్యోగుల ప్రస్తావనే లేదు
ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా నిరుద్యోగుల ప్రస్తావన లేదు. నిరు ద్యోగ భృతి హామీ అయితే ఇచ్చారు గానీ అమలుపై ఆసక్తి చూపడంలేదు. అసలు నిరుద్యోగభృతి అమలు చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా? లేకుంటే ఎప్పటిలానే యూటర్న్ తీసుకుంటారా? అర్థం కావడంలేదు.
–హరిప్రసాద్‌రెడ్డి, వైఎస్‌ఆర్ సీపీ
ప్రచార విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్

ఊసే లేని ఫీజు రీయింబర్స్‌మెంట్

ఊసే లేని ఫీజు రీయింబర్స్‌మెంట్