
ఢిల్లీలో కీర్తి ప్రతిష్టలు చాటిన తంబళ్లపల్లె విద్యార్థి
తంబళ్లపల్లె: రాజకీయరంగంలో టీఎన్ విశ్వనాథరెడ్డి 1962లో రాజంపేట ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికై అప్పటి ప్రధాని జవహలాల్ నెహ్రూ చేతుల మీదుగా పార్లమెంట్ భవనంలో సత్కారాలు అందుకుని తంబళ్లపల్లె పేరు ప్రతిష్టలను చాటారు. నేడు విద్యారంగంలో మరో మారు పల్లెటూరి విద్యార్థిని తేజస్విని సీఎంఏలో ఆలిండియా మొదటి ర్యాంకు సాధించి భారత రాష్ట్రపతి దౌప్రది ముర్ము చేతుల మీదుగా సర్టిఫికెట్, మెడల్స్ అందుకుని తంబళ్లపల్లె పేరు నిలిపింది. తంబళ్లపల్లె మండలం కన్నెమడుగుకు చెందిన కె.రఘరామిరెడ్డి, నాగవేణి దంపతుల కుమార్తె తేజస్విని చిన్న తనం నుంచి చదువులో ప్రతిభ చాటుతూ జూన్ 2024 విడుదలైన సీఎంఎ పరీక్షల్లో ఆలిండియా మొదటి స్థానంలో నిలిచింది. వ్యవసాయ కుటుంబంలో పుట్టి రోజువారి తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి పట్టుదలతో చదివింది.అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. ఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మెడల్, సర్టిఫికెట్ అందుకుంది. సీఏ ఫైనల్ ఫలితాల్లో ఆలిండియాలో 14 ర్యాంకు దక్కించుకోవడం గమనార్హం.
రాష్ట్రపతి చేతుల మీదుగా సర్టిఫికెట్ అందజేత