
ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం తగదు
రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన ఫిర్యాదుల పట్ల అలసత్వం వహించరాదని పోలీసు యంత్రాంగాన్ని జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి ఆదేశించారు. సోమవారం రాయచోటిలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎీస్పీ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి, అర్జీదారులతో అదనపు ఎస్పీ ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి సత్వర న్యాయం అందించేలా కృషి చేయాలన్నారు.
జిల్లా అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి